పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨- తానాషా దర్బారు

7

నాఁడు తానాషాసుల్తాను మొదటి మంటపముననే దర్బారు తీరియుండెను. అవిూరులు, వజీరులు, ఉమ్రాలు, ఫౌజుదార్లు, వారివారి పరివారము, తెలుఁగుదొరలు, జోదులు, విదేశీయులు, ఎల్లవారును వారివారి స్థలములలో కూర్చుండియు నిలువఁబడియు నుండిరి. సిపాయీలు దర్వాజాలకడ విచ్చుకత్తులతోను ఈఁటెలతోను జాగరూకులై, వచ్చుచు పోవుచు నున్నవారిని నిదానించి చూచుచుండిరి. దర్బారులో సుల్తాను ప్రక్క మొగలాయీపాదుషా ఔరంగజేబు పంపిన రాయబారి కూర్చుండి యుండెను.

మొగలాయి రాయబారి ఇట్లు మాటలాడు చుండెను. ― ‘తానాషాసుల్తాౝబహద్దరుగారు, మాయేలినవారు ఔరంగజేబు అలంఘీరు పాదుషావారు మమ్ము గోలకొండకు పంపి కొన్ని నెల లైనవి గదా. మేము తెచ్చినజాబును ఇప్పటికి ఎవరును చదువలేదు గదా. దర్బారులోనే లేనప్పుడు దూరపు పరగణాలలోను గ్రామములలోను ఎవరుండఁగలరు? మాకు సెల విప్పించిన మేము మరలి పోయి పాదుషావారికి ఈవిషయమును నివేదింపఁగలము—గోలకొండలో ఇట్టి జాబులు చదువఁగలవారు గాని వ్రాయఁగలవారు గాని లేరని.’

తానాషా ― (ప్రశాంతముగా) రాయబారిభాయిగారు, తొందరపడ వలదు. మాదేశము పెద్దది. చాల దూరము వ్యాపించి యున్నది. అందువలన చక్కని ముసద్దీలను దూర