పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨ - తానాషా దర్బారు

5

గా. అచ్ఛా, అచ్ఛా. అట్లయిన మనము సుల్తానువారి దర్శనమునకే ముందుపోదము. దండోరా జమాదార్, నీవు ముందుగా పోయి సుల్తానువారికి మా సలాములు చెప్పి, ‘పాదుషావారు పంపిన జాబు చదువఁగల గుమాస్తాలు, ఇరువురు బ్రాహ్మణయువకులు ఓరుగంటి నుండి వచ్చియున్నారు. మా కొలువులో నున్నారు. వారిని మేమే సుల్తానువారి దర్శనమునకు తెచ్చుచున్నాము’ అని మనవి చేయుము. మేము, ఇదుగో ఇప్పడే వచ్చుచున్నాము.”

వెంటనే ఊరంతయు పుఖారేర్పడెను. చాల నేర్పరులైన గుమాస్తాలు ముజఫరుసాహేబువద్ద చేరియున్నారని అందఱును చెప్పుకొనసాగిరి. కబురందఁగానే సుల్తాను వెంటనే ఆయువకులను తోడితెమ్మని పరుగుబంట్రౌతును పంపెను. ఇఁక తప్పదని అక్కన్నమాదన్నలను వెంటబెట్టుకొని ముజఫరు దర్బారునకు పోయెను.


ప్రకరణము ౨ - తానాషా దర్బారు

గోలకొండ గొప్పపర్వతదుర్గము. కొండకు క్రింద మొదటి దర్వాజాకడనుండు తిన్నెలకడ దాదాఁపు తొంబదిలేక వంద యడుగుల యెత్తు గోడలవిూఁద గండభేరుండపక్షులు చిత్రితములై యున్నవి. నేఁడును యాత్రికులు చూడవచ్చును. దర్వాజాకు ఆనుకొనియుండు తిన్నెలపై కూర్చుండి మాటలాడిన యెడల ఆశబ్దము పైకిపోయి కొన్నినిముసములు