పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

అక్కన్న మాదన్నల చరిత్ర

యువకులు ― ఇది చాల రహస్యమైన విషయము. సుల్తానువారి సన్నిధిలో చదువఁదగినది.

సేనాపతికి ఈజవాబు కొంత యతృప్తిని కలిగించినది. అతఁడొక క్షణము ఆలోచించి ‘అటులైన మనము రేపు సుల్తానువారి దర్శనమునకు పోదము. ఈ దినము మనకు ఇచ్చట తొందరపని యున్నది గదా’ అని యనెను.

ఆ యువకులకు ముజఫరు మాటలలో ఏదో సందేహము తోఁచినది. వారు ఒకరి నొకరు చూచుకొనిరి. ఆచూపులలోనే వారి యభిప్రాయము ‘ఈ మహానుభావుఁడేదో అడ్డుదారి తీయుచున్నాఁడే! ఈతని కప్పుడే మనమీఁద అసూయ జనించినది.’ అనున ట్లుండెను. ఆ యువకులు పైయెత్తు ఎత్తిరి. ‘సర్దారు చిత్తము. మరి దండోరావారు ఈ విషయము సుల్తానువారికి నివేదించిన వా రేమనుకొందురోగదా? అని దండోరా జమాదారును కనుగీటెను.

జమాదారు ― సర్దార్ సాహేబ్, సుల్తానువారి పనికన్న మనకు వేఱుపని యేమి ముఖ్యము. సుల్తానువారికి ఈ సంతోషవార్త మొదట నివేదించి తర్వాత మనపని చూచుకొనుట మంచిది. ఈ యాలస్యమునకు వారు సహింపలేరు సాహేబ్.

ముజఫరు ఆలోచించెను―‘ఈజమాదారు వదలఁడు. ఈ తెలుఁగు యువకులు అసాధ్యులుగా నున్నారు. ఏమిగతి? కానీ చూతము గాక,’ అని, వారితో నిట్లనెను ― “ఓహో! ఆలా