పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

అక్కన్న మాదన్నల చరిత్ర

వైద్యులు రజాకును పరీక్షించి ఆతని శరీరమందు మొత్తము డెబ్బదిగాయములనియు గాయములమీఁద పడిన గాయములకు లెక్కలేదనియు చెప్పిరి. ఒకకన్ను పూర్తిగా పోయినను రెండవది గట్టిగానుండెను. ఆతఁడు బ్రతుకుట మాత్రము దైవాధీన మనిరి. పదమూఁడుదినములు వైద్యు లుపచరింపఁగా రజాక్ కన్నుతెఱచి ‘తానాషా’యని పలవరించెను. ఆతర్వాత నాతనికి నెమ్మదించునని వైద్యులకు ధైర్యమువచ్చినది. రజాకునకు స్పృహవచ్చినదని పాదుషాకు తెలియఁగానే ఆతఁడు రజాకునకిట్లు వ్రాసెను. “నిన్ను మేము క్షమించితిమి. నీ పెద్దకుమారుఁడు అబ్దుల్‌ఖాదర్‌ను, ఇంకను కొలువు చేయఁగల వారిని మాకడకు పంపుము. వారందఱును తమతండ్రి కొఱకును తమ కొఱకును మాక్షమను ప్రార్థించిన వారికి మర్యాదలిచ్చి ఉన్నతోద్యోగముల నీయగలము.”

ఈవిధముగా పాదుషా చెప్పిపంపఁగా రజాకు మర్యాదార్థము పాదుషాకు వందనములు చెప్పెనుగాని ఇట్లనెను “ఇంతవఱకు నాప్రాణములు పోక నేను బ్రతికియుండుట నిజమేకాని ఈప్రస్తుతదురవస్థలో నేను బ్రతికి పాదుషావారికి బానిస నగుదుననుట మాత్రము కల్ల. దయామయుఁడగు భగవంతుఁడు నాకు సంపూర్ణారోగ్యము నిచ్చి నాజీవితమును పొడిగించినను సర్వవిధముల చితికిపోయిన నేను ఇఁకను నౌకరీ చేయఁగలనను నమ్మకము మాత్రము లేదు. ఒకవేళ చేయఁగలిగినను అబుల్‌హసౝ తానాషాచేత వృద్ధికి తేఁబడినవాఁడు