పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౪ - అబ్దుల్‌రజాక్‌లారీ బ్రదుకుట

121

యాజ్ఞచే గ్రహించిరి. సాదత్‌ఖానునకు తానాషాపై నభిమాన ముండెను గాని ఆతఁ డేమియు చేయలేకపోయెను.




ప్రకరణము ౨౪ - అబ్దుల్‌రజాక్‌లారీ బ్రదుకుట

ఆనాఁ డట్లుపడిపోయిన అబ్దుల్‌రజాక్‌లారీని మరల కొందఱు రుహుల్లాఖాను కడకు కొనిపోయిరి. లెక్కలేని గాయములతో ఒడలు తెలియక లారీ పడియుండెను. షాఫ్‌షికౝఖాౝ ఆతనిని చూచి “ఆహా! ఆ పొగరుపోతు, పాపిలారీ! వీని తలకాయను తత్క్షణమేకొట్టి, పాదుషాకు చూపి, కోటదర్వాజాకు తగిలింపవలెను” అనెను. రుహుల్లాఖాౝ అడ్డుపడెను. ‘ఈవిధముగా ప్రాణముపోవునట్టి స్థితిలో నున్నను ఈతఁడు గొప్పవాఁడు. ఇట్టివాని తలను పాదుషాఆజ్ఞలేక కొట్టుట ఔదార్యముకాదు’ అని అతనివిషయము పాదుషాకు పోయి చెప్పెను. పాదుషా ఆతని ఆయద్భుత వీరవిహారమును స్వామిభక్తిని విని ఆతని గాయములను మాన్పుటకు ఇరువురు వైద్యులను నియమించెను. వారిలోనొకఁడు పాశ్చాత్యుఁడు, రెండవవాఁడు మహమ్మదీయుఁడు. వారిని ప్రతిదినము లారీయొక్క స్థితిని తనకు తెలుపుఁడని పాదుషా ఆజ్ఞాపించెను; “తానాషాకు అదృష్టముండి, రజాక్‌వంటి స్వామిభక్తిపరాయణుఁడు మఱి యొకఁడుండిన యెడల ఈకోటను పట్టుటకు మనకు ఇంకను చాలకాలము పట్టియుండును” అని ఆశ్చర్యపడెను.