పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

అక్కన్న మాదన్నల చరిత్ర

గ్రహించి వెంటనే ఇట్లు జవాబిచ్చెను. ‘అవును, ఇదే భోజనానికి సమయము’ రుహుల్లాఖా ననెను. ‘అది నాకుతెలియును. ఇటువంటిసందర్భమున తమ కెట్లురుచించును?’

తానాషా గంభీరముగ నిట్లు బదులిడెను. ‘మీరు సాధారణజనులను మనస్సులో నుంచుకొని మాటలాడుచున్నారు. నాకు భగవంతునియందు సంపూర్ణవిశ్వాసము కలదు. ఆయన దయామయుఁడు, మహనీయుఁడు, ఈప్రపంచము నంతటిని సృజించి ధనికులు దరిద్రులు అను భేదములేక కాపాడువాఁడు. తన కృపాకటాక్షమును తనసేవకుడైన తానాషామీఁదినుండి ఎంతమాత్రము మరల్పఁడు. నాపితామహ మాతామహు లిరువురును తమజీవితకాలము నంతటిని ఐశ్వర్యములో గడపినారు. కాని నేను కొంతకాలము దారిద్ర్య మనుభవింపవలయునని భగవంతుని ఆజ్ఞ కాఁబోలు గడపినాను. మరల ఆమహామహుఁడు ఈ దీనునిమీఁద కనికరించి సకలైశ్వర్యములను ఇచ్చినాఁడు. నాకు ఆయన కుదిర్చినసన్నివేశములచేత ఒకగంటలో రాజనైతిని. నేను సుల్తానగుదునని ఎవరును తలంపలేదు. నేనుకూడ! భగవంతుని యనుగ్రహమువలన నాహృదయమున కోర్కెలేవియులేవు. లక్షలు దానమిచ్చితిని, కోట్లు ఖర్చుచేసితిని, ఇప్పుడు రాజ్యాధిపత్యమును భగవంతుఁడు నాకడనుండి లాగివేయఁ జూచుచున్నాఁడు. నేనేమైన నపరాధ మొనర్చితినేమో! దేవుఁడు ఈమాత్రము దయచూపుచున్నందులకు నేను కృతజ్ఞత చూపవలసినదేగాని చింతింపవలసినవాఁడనుగాను. నా