పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

అక్కన్న మాదన్నల చరిత్ర

కొట్టుచుండెను. అడుగడుగునకును తనమీఁదికి కత్తులును ఈఁటెలును వచ్చుచుండఁగా వానిని కొట్టుచు త్రోయుచు నాతఁడు పోవుచునేయుండెను. నఖశిఖపర్యంత మాతనికి కత్తిదెబ్బలును ఈఁటె పోటులును. దర్వాజావఱకును పోయి తలుపులు వేయ వలయునని ఆతని యుద్దేశము కాఁబోలు. లెక్కలేని గాయములకుతోడు ఆతనికి మొగమున పండ్రెండు గాయములు తగిలినవి. ఒకదెబ్బకు కన్నొకటి పోయినది. ఆతని గుఱ్ఱమునకు చాల గాయములు తగిలి అది అతని బరువునకు వణకుచుండెను. ఇంతవఱకు వచ్చినంతట ఆతఁడు గుఱ్ఱముయొక్క కళ్లెములను వదలి దానిని మాత్రము తనకాళ్లసందున గట్టిగా పట్టుకొనెను. ఆ గుఱ్ఱము తత్క్షణమే గుంపు నుండి తప్పించుకొని రజాక్‌ను కొనిపోయి ఒక చెట్టుక్రింద త్రోసి చూచుచు నిలిచియుండెను. ఇంతలో తెల్లవాఱెను. ఎవఁడో ఆతని గుర్తించి దయదాల్చి తనయింటికి వెూయించుకొని పోయెను.




ప్రకరణము ౨౩ - తానాషా కడపటివిందు

కోటయంతయు గందరగోళింపసాగెను. వెంటనే తానాషాకు ఈవార్త అందినది. తత్క్షణమే సుల్తాను కోటలోను అంతఃపురమందును ఏడ్చుచున్న స్త్రీలను పరివారమును ఓదార్చి వారికడ సెలవు తీసికొనసాగెను. తర్వాత ఆస్థానమునకు వచ్చి తన సింహాసనముమీఁద కూర్చుండెను. ఆవాహన లేని అతిథు