పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౨ - అబ్దుల్‌రజాక్‌లారీ కడపటియుద్ధము

115

వారి సైన్యమురాఁగానే తాను తలుపు తెఱచున ట్లాతఁడు రహస్యముగా నొప్పుకొనెను. ఈవిషయము తానాషాకును రజాకునకును తెలియదు.

ఒకనాఁడు రాత్రి మూఁడుజాము లైనతర్వాత మొగలాయీ సర్దారులు రుహుల్లాఖాను, ముఖ్‌తర్‌ఖాను, రణమస్తఖాను, సాఫ్‌షికౝఖాను మొదలైనవారు అబ్దుల్లాఖాను చెప్పిన మార్గములలో కోటగోడలమీఁదికి వచ్చిరి. మహమ్మద్ ఆజంషా, పాదుషాకుమారుఁడు, సైన్యముతో కోటదర్వాజా కడకువచ్చి నిలిచెను. వెంటనే అబ్దుల్లాఖాౝపాని తలుపులు తెఱచివేసెను. మొగలాయీలు లోపల ప్రవేశింప నారంభించిరి.

ఈయార్భాటములు వినరాఁగానే అబ్దుల్‌రజాక్ తానాషాయందలి భక్త్యనురాగములు ఒక్కమాఱుగా ఉబికిరాఁగా తటాలున యుద్ధసన్నద్ధుఁ డాయెను. తాను పూర్తిగా కవచాదులు ధరించుటకుగాని గుఱ్ఱమునకు జీనువేయుటకుగాని అవ కాశము లేదు. ఒక కత్తి చేతఁగొని కనఁబడిన యొక గుఱ్ఱముయొక్క వట్టి వీపుమీఁదికి దుమికి రెండవచేత డాలు మాత్రముగొని యుద్ధమునకు ఉఱికెను. అతని వెంటనుండిన పండ్రెండుగురును అట్లే దుమికిరి. ఆ యావేశములో ఎవరు ఎచట నుండిరో వారెరుఁగరు. ఊహాతీతమైన పరాక్రమమును రజాక్ చూపసాగెను. అఱువదియేండ్లవాఁడు కాళ్లతోను చేతులతోను పోరాడెను. ప్రాణమునకే తెగించెను. ‘శరీరములో ప్రాణముండు వఱకు పోరాడవలసినదే’ యని ఆతఁ డఱచుచు