పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

అక్కన్న మాదన్నల చరిత్ర

షాకు ఇట్లుచెప్పి పంపెను. “ఈమహాయుద్ధమునకు పోల్పఁదగినది కర్బలాయుద్ధము తప్ప వేఱుకానరాదు. హజరత్ ఇమాంహుసేనుగారితో చేరియుండి తుదకు ద్రోహులై అతని మీఁదనే కత్తినెత్తిన పాపులతో అబ్దుల్‌రజాక్‌లారీ ప్రాణముండఁగా ఎంతమాత్రము చేరఁడు. ఆడెబ్బదిఇరువురు వీరులలో నొకనివలె ఇహపరములలో కీర్తిప్రతిష్ఠలు నాకు రాగలవు. తమ నాయకునికిని తమకును ప్రాణముండు వఱకును పోరాడి నశించినవారిలో నొకఁడను కాఁగలను.” ఈవాక్యములు పాదుషాకు పోయి చెప్పిరి. ఆతఁ డాశ్చర్యపడెను. రజాక్‌మీఁద చాలగౌరవ మేర్పడెను. కాని ప్రత్యక్షముగ మాత్రము ‘చీ! ఎంత దురదృష్టవంతుఁడు’ అనెను.

మరల మొగలాయీలు ముట్టడి ప్రారంభించిరి. రుహుల్లా ఖాననువాఁడు కోటను పట్టుటకు తన సామర్థ్యము నంతయు వినియోగింప నారంభించెను. తుదకాతని ప్రయత్నములకు కొంత ఫలము కనఁబడెను. కోట తలుపులు తెఱచు నుపాయము కనఁబడెను. అబ్దుల్‌రజాక్‌లారీ ఎదురు తిరుగఁగా అబ్దుల్‌ఖాౝపాని లొంగిపోయెను. ఈతఁడు తానాషాకు మిగిలిన యిద్దరు ప్రధానులలో నొకఁడు. ప్రధానమైన ఖిర్కిదర్వాజా యీతని స్వాధీనమందుండెను. ఎట్టి యాలస్యమును లేక కోటనుపట్టు మార్గమును చెప్పవలసినదని యాతనిని మొగలాయీలు ప్రార్థించిరి. వారు చూపిన యాశలకు లొంగి, కోటగోడలలో ఫిరంగిదెబ్బలకు చెడిపోయిన ప్రదేశములను చెప్పి మొగలాయీ