పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

అక్కన్న మాదన్నల చరిత్ర

క్రీ. శ. 1687 సం. జూౝ నెల 20-వ తారీఖునాటికి గోలకొండ కోటగోడల క్రిందికి మూఁడు సొరంగములు త్రవ్వఁబడినవి. వాని నిండుగ తుపాకిమందు నిండింపఁబడినది. తుపాకి మందుకు నిప్పంటించుటకు కొంతముందు మోర్జాలవారు గొప్ప శబ్దము చేయుచు వీరావేశముతో యుద్ధమునకు వచ్చుచున్నట్లు ఉండినయెడల కోటలోపలి రస్తుసిబ్బంది ఇది యేవెూ యని గుంపుగా గోడలమీఁదికి వత్తురనియు తుపాకిమందు పేలినవెంటనే మొత్తముగా చత్తురనియు పాదుషా ఆలోచించి అట్లు చేయుమని ఆజ్ఞాపించెను.

కాని మొగలాయీల యీప్రయత్నమంతయు అబ్దుల్ రజాక్ ఎట్లో గ్రహించెను. ఆతఁడును ఆతని యనుచరులును ఎట్లో ప్రయత్నించి ఆ ప్రదేశమును కనుఁగొనిరి; గోలకొండ కోటలోపలినుండి త్రవ్వి ఆ తుపాకిమందును పూర్తిగా రెండు సొరంగములనుండి తీసివేసి ఆ ప్రదేశమంతయు నీరుపాఱించి మట్టితో కప్పివేసిరి. మిగిలినదానినంతయు నీటితో తడిపిరి. ఇంతలో బయట మొగలాయీలు కోటపట్టునట్టి హాహాకారములు చేయఁగా కొందఱు కోటగోడలమీఁదికిపోయి చూడసాగిరి. పాదుషా ఏర్పాటుప్రకారము సర్దారులు ఈల వేయఁగానే మందులవారు మొదటి సొరంగముకడ నిప్పంటించిరి కొంత మందు పోయినందుచేతను కొంత తడిసినందుచేతను మొగలాయీలకు చేర్పుగానున్న భాగమందు మందు బాగుగా నుండినందున వారివైపే పేలినది. మొగలాయీలే ఎక్కువ