పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

అక్కన్న మాదన్నల చరిత్ర

ఆకాశమంతయు పొగగ్రమ్మి పగలురాత్రి యనుభేదము పోయినది. అంతయు చీఁకటియైనది. ప్రతిదినమును ఢిల్లీవారి సైన్యము మహాపరాక్రమమునుచూపి పోరాడుచునే యుండిరి. అనేకులు చనిపోవుచుండిరి. కొందఱు పాదుషాను మెప్పించుటకును ఆతనిమీఁది తమభక్తిని ప్రకటించుటకును సంవత్సరపు పని ఒక నెలలోను ఒక నెలపని ఒక దినములోను చేయుచు సొరంగములు త్రవ్వుచు, యంత్రములు నిర్మించుచు కోటలో ప్రవేశించుటకు మార్గములు వెదకుచు కష్టపడి ఎట్లెట్లో ప్రాణములకు తెగించి అగడితను సమీపించిరి. తర్వాత అగడితను మట్టితో పూడ్చుటకు పాదుషా ఆజ్ఞయాయెను. పాదుషా తానే స్వయముగా నొక గోనెసంచిలో మన్నుపోసి కుట్టి అఖాతములో వేసెను. సైన్యమంతయు పాదుషాను అనుకరింప నారంభించెను; ఫిరంగులు ఎక్కించి కోటమీఁదికి ప్రయోగించుటకు ఎత్తు కట్టడములు కట్టనారంభించెను.




ప్రకరణము ౨౦ - క్షామము

ఈవిధముగా నెంతపని చేయుచున్నను కోట బురుజులలో కొన్ని ప్రదేశములు పగిలి గోలకొండ సైన్యమునకు రక్షణతగ్గినను మొగలాయీ సైన్యములో కొంత యతృప్తి యేర్పడి చాలమంది తిరుగుబాట్లు చేయునట్లుండిరి. ఇందులకు కారణము జనులకు ఆహారము లేకపోవుటయు జంతువులకు