పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

87

రనియు వారి పతనముచేత నీ సామ్రాజ్యము నశించుననియు నామూర్ఖురాండ్రుకు తెలియదుగదా. మిగిలిన సర్దారులు కొందఱు ద్రోహులు. అక్కన్న మాదన్నలమీఁద వ్యక్తి ద్వేషముగల వారు కొందఱు. మొగలాయీలు బలవంతులుగాన ఎట్లును గోలకొండపడిపోయిన తమయుద్యోగములకు లోటుండదని తలంచిన వారు కొందఱు. అబ్దుల్‌రజాక్‌లారీ పైబృందములలో వేటితోను చేరఁడు. ఆతఁడు బుద్ధిమంతుఁడును సమర్థుఁడును. అక్కన్న మాదన్నలు రాజభక్తులనియు దేశభక్తులని మహాసమర్థులనియు నాతఁ డెఱుఁగును. పాడువేదాంతము వారిని చెఱచినది. తానో స్వయము రాజభక్తిసంపూర్ణుఁడు, వయసు చెల్లినవాఁడు. ఆతని చూపులో ఎంతభావము కలదోగాని చాలగొప్పవాఁ డనిమాత్రము తెలియుచుండెను. ఆతఁడు మెల్లగా తానాషా సమీపమునకు వచ్చి మోకాలిపై నిలిచి నెమ్మదిగా ‘జహాపనా’ అనెను.

తానాషా అతనివైపు చూచెను. ఆచూపులో నాతఁడు మరల మనలోకమునకు వచ్చుచున్నాఁడని యనిపించుచుండెను. ‘జహాపనా’ యను నాచల్లని పిలుపు ఆతనికెంతయో హృదయాహ్లాదకరముగా నుండెను. మరల నాతఁడు ‘జహాపనా’ యనెను. ‘అబ్దుల్ రజాక్ సాహెబ్, చెప్పండిభాయి’ అని సుల్తాను ప్రియముగా పలికెను. రజాక్ ఇట్లు చెప్పనారంభించెను. ‘జహాపనా, దయచేసి తొందరపడవలదు. మనకింకను చాల పని యున్నదిగదా. తాము మహావేదాంతిగదా. ఎవరికిని కాలము