పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లౌకిక మానవుడు సుఖభోగాలను కోరుకొంటాడు. ఈ ప్రకృతిని అణచుకోవడం కష్టం. నిగ్రహం కలవాళ్లేగాని పుణ్యజీవితాన్ని సాధించలేరు. దీనికి ఆత్మ ప్రేరణం, వరప్రసాదం కావాలి. మహా భక్తులు చాల శ్రమజేసి ఈ స్థితిని పొందగలిగారు. ఇంకా పుణ్యసమగ్రతను స్వల్పకాలంలోనే సాధించలేం. దీని కొరకు జీవితాకాలమంతా కృషి చేయవలసిందే. బొగ్గు రత్నంగా మారటానికి చాలకాలం పడుతుంది. ప్రాకృతిక నరుడు ఆధ్యాత్మిక నరుడుగా మారడానికి నాలు యేండ్లు పడతాయి. దీనికి మన తరుపున వొపికా, పట్టుదలా, సడలని దీక్షా కావాలి. 3. ఆధ్యాత్మికతను సాధించడంలో అపమార్గాలు జనులు ఆధ్యాత్మికతను సాధించడానికి పూనుకొని గూడ అపమార్గాలు పడుతుంటారు. తప్పత్రవలు తొక్కుతుంటారు. ఇవి చాల రకాలుగా వుంటాయి. కొందరు దేవుడు చాలు అనుకొంటాడు. తోడివారిని అట్టేపట్టించు కోరు. సామాజిక స్ఫురణ వుండదు. నేను నా దేవుడు, నేను భగవంతుణ్ణి పూజిస్తే చాలు అనుకొంటారు. ఇది తప్పడు మార్గము. దేవుడు తరచుగా తోడిజనంలోనే దొరుకుతాడు. మార్గానికి కేవలం భిన్నంగా కొందరు సంఘ సేవ చాలులే అని వాదిస్తారు. భగవంతుణ్ణి పట్టించుకోరు. పేదలను ఆదుకొంటేచాలు, సంఘ సేవ తప్ప వేరే దేవుడు అక్కరలేదు అంటారు. కాని నరునికి విలువ యొక్కడ నుండి వచ్చింది? భగవంతుడు సృజించబట్టి, దేవుడు తన పొలికను అతనిలో పెట్టబట్టి నరునికి విలువవచ్చింది. కనుక దేవుణ్ణి విడనాడి కేవలం నరులకు సేవ చేస్తాను అంటే కుదరదు. ఇంకా కొందరు లోకంలోని ఆయా వస్తువులతో సరిపెట్టుకొని దేవుణ్ణి ○