పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పయనించారు. యెరూషలేములోని ఆదిమ భక్తులు క్రీస్తుకొరకు అవమానాలు శ్రమలు పొందే భాగ్యం కలిగింది కదా అనుకొని సంతోషించారు -అచ 5,41. సుఖభోగాలు అనుభవించిన వాళ్లేవరు అర్యశిష్టపట్టం పొందలేదు. సుఖాల వల్ల మనశ్శాంతి కలగదు. ఇంకా యొక్కువ సుఖాలు అనుభవించాలనే కోరిక పుడుతుంది. కట్టెలు ಪೆಸಿ కొద్ది మంటలు ఇంకా పెద్దవెతాయి. నిగ్రహం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మనసు దేవుని వైపు మరలుతుంది. 3) ఏయే రంగాల్లో నిగ్రహాన్ని పాటించాలి? క్రైస్తవ భక్తుడు శరీరాన్నీ యింద్రియాలనూ అదుపులో పెట్టుకోవాలి. పౌలు అంతటివాడు ఇతరులకు బోధించాక నేను భ్రష్టుణ్ణి కాకుండడానికి నా శరీరాన్ని నలగగొట్టి అదుపులోకి తెచ్చుకొంటున్నాను అని చెప్పకొన్నాడు -1కొరి 9,27. దేహం చాలసార్లు ఆత్మను పాపంలోకి లాగుతుంది. ఇది సమాచార సాధనాల యుగం కదా! సినిమాలు, టీవీలు, పత్రికలు, పోస్టర్లు స్త్రీ దేహాన్ని కామ వస్తువుగా చిత్రంచి నరుల్లోని కామేచ్ఛను రెచ్చగొడతాయి. కన్నులు మనిషి హృదయానికి కిటికీల్లాంటివి. వాటిద్వారా వెలుపలి ప్రపంచమంతా మన మనసులోకి ప్రవేశిస్తుంది. కనుక భక్తుడు నేత్రాలను అదుపులో వుంచుకోవాలి. కొన్నిసార్లు ముచ్చట్లలో పడి ఇరుగుపొరుగు వాళ్లను ఆడిపోసుకొంటాం. సోదరప్రేమను భగ్నం చేస్తాం. కనుక నాల్మను నియంత్రించాలి.

 మనకు భావనాశక్తి వుంటుంది. దీనిద్వారా నిజంగా జరగని సంఘటనలు కూడ మన కండ్ల యెదుట జరిగినట్లుగా ఊహించుకొంటాం. కొందరు ఈ భావనాశక్తితో కామ సంబంధమైన దృశ్యాలను ఊహించుకొని లైంగికానందాన్ని పొందుతారు. ఈ చర్య పాపానికి దారితీయవచ్చు. కనుక వూహాశక్తిని చెప్పచేతల్లో వుంచుకోవాలి. పగటి కలల్లో పడిపోకూడదు.