పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆహారం లాంటిది. రొట్టె, నీరు తేనె ద్రాక్షరసం, పాలు దానికి వుపమానాలు. ఇవన్నీ భోజన పదార్థాలే. ఈ పదార్థాల్లాగే వాక్యం కూడ మనలను పోషిస్తుంది. క్రీస్తు పిశాచంతో వాదిస్తూ నరునికి దేవుని వాక్కే ముఖ్యమైన ఆహారం అని చెప్పాడు కదా -మత్త 4,4 ప్రభువు వాక్కున్యాయాధిపతి లాగ తీర్పు తీరుస్తుంది. పూర్వం నాతాను ప్రవక్త దావీదును "ఆ దుర్మార్గుడివి నీవే" అని మందలించినట్లుగా వాక్కు మనలను మందలిస్తుంది –2సమూ 12,7. వాక్కు విత్తనం లాంటిది. మన హృదయం పొలంలాంటిది. అది మన హృదయంలో పడి నూరంతలుగా పంటనీయాలి -మత్త 13,4. వాక్కు వెండిబంగారాల్లాగ విలువైనది. నరుడు వెండి బంగారాలను కూడ వదలుకొని వాక్కుని సంపాదించుకోవాలి -సామె 8,10. వాక్కు మనలను నడిపించే దీపం. మనం ఈ లోకం నుండి పరలోకానికి పయనం చేసే యాత్రికులం. ఈ యాత్రలో వాక్కు దీపమై దారి చూపుతుంది –కీర్త 119,105 వాక్కు మన హృదయంలో వసించేది. కుండ నీటితో లాగే మన హృదయం వాక్కుతో నిండివుండాలి -కొలో 3,16. బైబుల్లో చాల పర్యాయాలు దేవుని వాక్కంటే దేవుడే. దానికి దేవునికున్నంత మహత్వం వుంటుంది. ఇవన్నీ వుపమానాలు. మన వాక్కుకి శక్తి వుండదు. మనం తాలు మాటలన్నీ మూటలాడతాం. కాని ప్రభువు పలుకుకి గొప్ప క్రియాశక్తి వుంటుంది. యూవే ప్రభువు రెల్లసముద్రం నీళ్లు పాయలు కావాలనగానే పాయలయ్యాయి. క్రీస్తు వాతావరణం ప్రశాంతం కావాలనగానే తుఫాను శాంతించింది -మత్త 8,26. ఈ శక్తి గల వాక్కు ఇప్పడు మన మీద పనిచేసి మనకు రక్షణాన్ని చేకూర్చి పెడుతుంది. దేవుని వాక్కుకి వరానికుండే శక్తి వుంటుంది -యెష 55, 10. వాక్కు భక్త్యావేశం హాజ్ఞ్యమాన శిష్యులు క్రీస్తు త్రోవలో