పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకానికీ దైవరాజ్యానికీ దగ్గరి సంబంధం వుంది. అవి రెండూ పరస్పరం కలసి వుంటాయి. ప్రాపంచిక జీవితం వేరు ఆధ్యాత్మిక జీవితం వేరు అనుకోగూడదు. నరుడు లోకంలో వుంటూనే ఆధ్యాత్మిక జీవితం గడపాలి. క్రైస్తవుడు ఈ లోక బాధ్యతలను విస్మరించకూడదు. ఆలా చేస్తే తోడిననరుల పట్లా భగవంతుని పట్లా మన బాధ్యతలను విస్మరించినట్లే. తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి క్రీస్తుని పంపాడు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దానిలో జీవించాడు. స్వయంగా వడ్రంగి వృత్తిని చేపట్టాడు. కనుక ఇహలోక జీవితాన్ని చిన్నచూపు చూడకూడదు. దాన్ని ఆధ్యాత్మిక జీవితంతో సమన్వయ పరచాలి. మన కుటుంబ జీవితం, మనం చేపట్టే వృత్తి రోజువారి పనులూ పరలోక జీవితంతో కలసిపోవాలి. లోకాన్ని అనాదరం చేయకుండ వుండడం మాత్రమే కాదు, దాన్ని ఓ యిల్లులాగ వో పట్టణం లాగ నిర్మించాలి. దైవప్రేమ వొక్కటే చాలదు. సోదరప్రేమకూడ వుండాలి. లోకాన్ని అభివృద్ధి చేస్తే తోడి ప్రజలకు సేవలు చేసినట్లే. క్రీస్తు ఈ లోకంలోని శ్రమలనూ యాతనలనూ పేదరికాన్నీ దుః ఖాన్ని పాపాన్నీ తొలగించడానికి వచ్చాడు. ఆలాంటప్పుడు మనం ప్రపంచాన్ని త్యజించడం భావ్యం కాదు. ఇప్పడు ప్రభువుతో కలసి దాన్ని వుద్ధరించడం మన పూచీ. తిరుసభలోకాన్ని ఉన్నత స్థితికి తీసికొని పోవాలని కోరుకొంటుంది. దాన్ని నరులు వసించడానికి మరింత అనుకూలమైన దాన్నిగా తీర్చిదిద్దాలని అభిలషిస్తుంది. అసలు తిరుసభ విశ్వాసికి సేవలు చేసి నూత్నయుగాన్ని సృజించడానికే వుంది. మనం కూడ ఈ మహత్తర కార్యంలో పాల్గొనాలి. పాపం, స్వార్థం, దూషితమైన ఆర్థిక సాంఘిక మానవీయ సంబంధాలు ప్రపంచాన్ని చెడగొట్టాయి. కాని దేవుని వరప్రసాదం పాపంకంటె, ఏ దుష్టమైన శక్తికంటె గూడ, బలీయమైంది. ఈ దైవవరప్రసాదం లోకాన్ని