పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్రవ్యం పిండిని పొంగించి రొట్టెలను తయారు చేయడంలో వుపయోగపడు తుంది. గృహస్థులు ఈ ద్రవ్యంలాగ లోకాన్ని పునీతం చేయాలి. వాళ్లు సాంఘిక ఆర్థిక రాజకీయ విషయాలు, కళలు విద్యవిజ్ఞాన శాస్త్రం, సమాచార సాధనాలు, వ్యాపారం, వ్యవసాయం, కుటుంబం మొదలైన లౌకిక రంగాల్లో కృషిచేయాలి. మరియమాత గృహస్థులకు ఆదర్శం కావాలి. ఆమె వొకవైపు కుటుంబ జీవితంలోని రోజువారి పనుల్లో మునిగివుండేది. మరోవైపు క్రీస్తుతో ఐక్యమై వుండేది. అతని పనులతో సహకరించేది. ఇప్పడు మోక్షంలో వుండి ఈ లోకంలో యాత్ర చేసే గృహస్థుల కొరకు ప్రార్ధన చేస్తూ వారికి ప్రేరణం పుట్టిస్తూంటుంది. గృహస్టులు ఆమె సహాయాన్ని అడుగుకోవాలి. ఆమెను ఆదర్శంగా తీసికోవాలి. ఇంకా వాళ్లు సంసార జీవితం గడిపిన ఇతర పునీతులను గూడ ఆదర్శంగా గైకొనవచ్చు. గృహస్టులు చేసే సేవలు గురువులు మఠవాసులు చేయలేరు. కొన్ని తావుల్లో వారికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. కనుక వారి సేవలు గణనీయమైనవి. 2. లోకం చెడ్డది కాదు పూర్వ భక్తులు లోకం చెడ్డది అనుకొన్నారు. లోకంలోని ప్రజల పాప జీవితాన్ని అసహ్యించుకొన్నారు. సమాజం నుండి వైదొలగి ఎడారిలోకొండ గుహల్లో ఏకాంతంగా వసించారు. పవిత్రత లోకాన్ని త్యజించడంలోనే వుంటుంది అనుకొన్నారు. కాని రెండవ వాటికన్ మహాసభ ఈ భావాన్ని అంగీకరించలేదు. లోకం దుష్టమైందీ పరిత్యజించవలసిందీ కాదు. దేవుడే దాన్ని కలిగించాడు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దాన్ని పునీతం చేశాడు. లోకంలో పాపమేమో వుంది. ఐనా ఆ పాపాన్ని తొలగించి యిప్పడు దాన్ని పవిత్ర పరచడం మన పూచీ. L