పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతదేశంలోని క్రైస్తవ వేదాంతాలు కూడ ఈ వుద్యమం నుండి ప్రేరణం పొంది ఇక్కడ సమసమాజం ఏర్పడాలని ప్రచారం చేస్తున్నారు. మనం కూడ ఈ వుద్యమాన్ని ఆహ్వానించాలి. 4. తిరుసభలో గృహసుల పాత్ర ఉపోద్ఘాతం క్రైస్తవ సమాజంలో గృహస్టుల పాత్ర యేమిటి? తొలి శతాబ్దాల్లో క్రైస్తవ ప్రజలంతా సమానమేననే భావం వుండేది. వీళ్లు గురువులు, వీళ్లు గృహస్టులు అనే తేడాలు వుండేవి కావు. విశ్వాసులంతా ఒఏ వర్గం అనుకొనే వాళ్లు. వ్యత్యాసం గురువులకూ గృహస్టులకూ మధ్య కాదు, క్రైస్తవులకూ రోమను సమాజానికీ మధ్య వుండేది. 11వ శతాబ్దానికల్లా అనేక కారణాల వల్ల గృహసుల స్థానం దిగజారిపోయింది. మధ్యయుగాల్లో గురువుల ప్రాబల్యం పెరిగింది. గృహస్తులు అనామకులుగా మిగిలిపోయారు. గురువులు వరప్రసాదాలూ దైవవరాలు పంచియిచ్చేవాళూ గృహస్టులు స్వీకరించేవాళ్లు మాత్రమే అనేకాడికి వచ్చింది. తిరుసభ అంటే కేవలం పాలకవర్గమైనర బిషప్పలూ గురువులు మాత్రమే ననే స్థాయికి దిగజారింది. రెండవ వాటికను మహాసభ గృహస్థుల స్థానం అనే విషయంలో పెద్దమార్పు తెచ్చింది. ఈ సభ బోధల ప్రకారం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన దైవ ప్రజలంతా సరిసమానం. వారి పనుల్లో తేడాలున్నా, వారి విలువ మాత్రం సమానమే. గురువులు ఆధ్యాత్మిక రంగంలోను గృహస్టులు లౌకిక రంగంలోను కృషిచేస్తారు. అందరూ కలసి దైవరాజ్యవ్యాప్తికి తోడ్పడాలి. ప్రవక్తయైన క్రీస్తులోకి జ్ఞానస్నానం పొందడం ద్వారానే గృహస్థులు కూడ ప్రేషితులు ఔతారు. వాళ్లు కేవలం గురువులకు సహాయకులు మాత్రమే కాదు. జ్ఞానస్నానం ద్వారా స్వయంగా బాధ్యతలూ అర్హతలూ కలవాళ్లు. L