పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రైస్తవులమే. క్రీస్తునుండి రక్షణం పొందేవాళ్లమే. ఐనా క్రీస్తుని ఈ దేశ సంప్రదాయం ప్రకారం పూజించవచ్చు. వేషభాషల్లో, ఆచారసంప్రదాయాల్లో ఈ దేశ ప్రజల్లాగ మెలగవచ్చు. భారతీయ క్రైస్తవులంగా జీవించవచ్చు. అందుకే మన వేదాంతులు హిందూ సంప్రదాయంతో సంప్రతింపులు జరపడం అవసరమని భావిస్తున్నారు. భారతదేశంలోని ఆధునిక పరిణామాలు కూడ మనలను ప్రభావితం చేస్తున్నాయి. అందరికీ ఆదర్శంగా వుండేవాడు మన జాతిపిత గాంధి. ఆయన పాటించిన సత్యాగ్రహ సూత్రాలు, అహింసాపద్ధతులు అందరికీ ఆచరణీయాలే. ఎవరూ ఎవరినీ హింసించకూడదు, అందరూ సత్యాన్ని పాటించాలి అనేవి గాంధీగారి ప్రధానసిద్ధాంతాలు. ఇవి మనకు కూడ వర్తిస్తాయి. అంబేద్కరు దళిత జనోద్ధరణకు పాటుపడిన నాయకుడు. అంటరాని తనాన్ని ఎదిరించి న్యాయం కొరకు పోరాడిన వీరుడు. ఈ యిద్దరు మహాపురుషుల ప్రభావం మన ఆధ్యాత్మికతలోకి కూడ ప్రవేశించాలి. సాంఘిక న్యాయం ఇప్పడు పెద్ద సమస్య మనదేశంలో కులవ్యవస్థ వల్ల కొందరిని కేటాయిస్తుంటారు. దేశంలో అధిక సంఖ్యాకులు పేదలు, కొద్దిమంది మాత్రమే సంపన్నులు. ఐనా అన్ని లాభాలూ సదుపాయాలూ సంపన్నులకే దక్కుతున్నాయి. పైగా వీళ్లు పేదలను పీడిస్తున్నారు. దళితులు, ఆదివాసులు మొదలైన బలహీన వర్గాలవారినీ పేదలనూ అణగ ద్రౌక్కుతున్నారు. ఇది పెద్ద అన్యాయం. అధికశాతం భూమి ధనికుల అధీనంలో వుంది. భగవంతుడు కొందరు ఉన్నత స్థితిలోను కొందరు హీనస్థితిలోను వుండాలని కోరుకోడు. ఈ యన్యాయాన్ని దేవుడు కాదు, నరులు చేశారు. కనుక మన ఆర్థిక, సాంఘిక రాజకీయ పరిస్థితులు పేదలకు అనుకూలంగా మారాలి. సామాజిక స్ఫురణ, పేదలపాట్లు మన దైవార్చనలోకి ప్రార్థనలోకి రావాలి. దళిత విమోచనం, పేదల అభ్యున్నతి ప్రధానమైన