పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1) కోరిక స్వభావం మన హృదయం మాములుగా భగవంతుణ్ణి కోరుకొంటుంది. కనుకనే కీర్తనకారుడు ఓ ప్రభూ ! దప్పికగొనిన జింక సెలయేటి నీటికొరుకు లాగే ত০ హృదయం నీ కొరకు తపిస్తూంది అని పల్మాడు -40, 22 ఐనా లోక వ్యామోహాల్లో తగుల్కొనిన వాళ్లల్లో దేవుని మీద పవిత్రత మీద అట్టే కోరిక వుండదు. వాళ్లు మాకు ప్రాపించిక సుఖాలే చాలు అనుకొంటారు. ఇది పరమ దౌర్భాగ్యం. 2) ఈ కోరిక ఆవశ్యకత పుణ్య సంపూర్ణతను సాధించాలనే కోరిక గాఢంగా వుండాలి. పుణ్యార్జనం దేవుని చిత్తం. దేవుడు మనలను తన కొరకే సృజించాడు కాని ఈ లోక వస్తువుల కొరకు సృజించలేదు. మీరు పవిత్రులుగా వుండాలనే దేవుని కోరిక -1 తెస్స 4, 3. ఈ దేవుని కోర్మెను మనం నెరవేర్చాలి. ఈ కోర్కె వల్లనే పునీతులు అంతటి వాళ్లయ్యారు. ఈ యాశే లేకపొతే వాళ్లు కూడ మనలాగే వుండిపొయేవాళ్లే అవిలా తెరేసమ్మగారు మొదట పుణ్యసమగ్రతను సాధించాలని కోరుకొన్నారు. కాని దాని కొరకు పెద్దగా కృషిచేయలేదు. కనుక చాలకాలం దాక అలాగే అపరిపూర్ణంగా వుండి పోయారు. అటుపిమ్మట ఆ రంగంలో విశేష కృషిచేసి గొప్ప భక్తురాలయ్యారు. ఆకలివేస్తేనే భోజనం బాగా అరిగి వృష్టినిచ్చేది. ఆలాగే ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలని కోరుకొంటేనే పతిత్రులమయ్యేది. పునీతుల చరిత్రలు ఈ సత్యాన్ని రుజువు చేస్తాయి. సంచి తెరచుకొని వుంటేనేగదా దానిలో చాల వస్తువులు పట్టేది. మూసుకొని వున్న సంచిలో సామానులు ఏలా పడతాయి? మన హృదయం కూడ దేవునికొరకు తెరచుకొని వుండాలి. దప్పికగొనిన వాడు నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు అన్నాడు ప్రభువు –యోహా 7, 37.