పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంఘటనలు అన్నిటిలోను అతని హస్తాన్ని చూడాలి. అతని అనుమతి లేండే చీమైనా కదలదు. అన్నిటిలోను భగవంతుణ్ణి అన్నిటినీ భగవంతుల్లోను చూడ్డం అలవాటు చేసికోవాలి. ఇంకా ఆ ప్రభువు మన హృదయంలోనే వసిస్తున్నట్లుగా భావించుకోవాలి. ఇదే అంతర్నివాసం. మన హృదయమే దేవాలయం. ఆ మందిరంలో దివ్య అతిథి కొలువుదీరివుంటాడు. మనలోనే వసిస్తున్న ప్రభువుని గుర్తించి స్తుతించి ఆరాధించాలి. ఈలా మనకు లోపలా వెలుపలా కూడ వున్న ప్రభువుని రోజు పొడుగున చాలాసార్లు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. భక్తిగల చిన్న చిన్న జపవాక్యాలు చెప్పకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసికోవాలి. 3) దైవసాన్నిధ్యాన్ని పాటించడం వలన లాభాలు దేవుడు పరమపవిత్రుడు. అతని సన్నిధిలో పాపంచేయడానికి జంకుతాం. పోతీఫరు భార్య తన్ను ప్రలోభపెట్టగా యోసేపు దేవుని సన్నిధిలో ఈలాంటి పాపకార్యం ఏలా చేసేది అన్నాడు –ఆది 39,9. పై వాళ్లు చూచినా, చూడకపోయినా దేవుడు గమనిస్తున్నాడు అనుకొని మన పనులన్నీ శ్రద్ధతో చేస్తాం. దేవుని సమక్షంలో మసలుతున్నాం గనుక మన ప్రవర్తనం మర్యాదగా, యోగ్యంగా వుంటుంది. దైవ బలంతో మన కెదురయ్యే శోధనలతో పోరాడి అధికాధికంగా పుణ్యజీవితం గడుపుతాం. ఆధ్యాత్మిక జీవితం గడపడానికి దైవసాన్నిధ్యం చాల విధాలుగా తోడ్పడుతుంది. కనుక సాధకుడు దీన్ని తప్పక అలవాటు చేసికోవాలి. 2. ఆత్మ శోధనం దైవ మార్గల్లో నడచిన భక్తులు ప్రాచీన కాలం నుండి ఆత్మశోధనం చేసికొంటు వచ్చారు. దీని ద్వారా ఆత్మను శుద్ధిచేసికొని దుష్టప్రవృత్తులను సవరించుకొంటాం. ఈ యభ్యాసం సేవకుడు యజమానునికి లెక్క వొప్పజెప్పినట్లుగా వుంటుంది. దీనిల్తో ఐదు మెట్లున్నాయి.