పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


2. ఆధ్యాత్మిక జీవితానికి సహాయకారులు కొన్ని భక్తికార్యాలు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటానికి సహాయం చేస్తాయి. భక్తుడు వీటిని తప్పక వాడుకోవాలి. ప్రస్తుతానికి ఈ సహాయకారులు ఏడింటిని పరిశీలిద్దాం. 1. దైవసాన్నిధ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. సాధకులు దేవుడు తమ్మ గమనిస్తున్నాడు అనుకొని తమ పనుల న్నిటిని భక్తిమంతంగా చేసికొన్నారు. దేవుడు అబ్రాహాముతో నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా జీవించాలి అని చెప్పాడు -ఆది 17,1. మనం ఆ ప్రభువు నందు జీవిస్తున్నాం, సంచరిస్తూన్నాం, ఉనికిని కలిగి వున్నాం -అ.చ 17,28. మనం దేవుణ్ణి కంటితో చూడకపోయినా ఆ ప్రభువు నిరంతరం మనలను చూస్తునే వుంటాడు. కనుక నరుడు దైవ భీతితో జీవించాలి. 1) దైవసాన్నిధ్యాన్ని అర్ధం జేసికొనే తీరు దేవుడు విశ్వమంతటా వుంటాడు. అతడు అన్నిటినీ కలిగించినవాడు, అన్నిటినీ వునికిలో వుంచేవాడు. అతడు చేయి విడిస్తే ఏ ప్రాణీ నిలువదు. ఆ ప్రభువు అన్నిటినీ గమనిస్తుంటాడు. ఏ ప్రాణీ అతని దృష్టిని, తప్పించుకోలేదు. అతని దృష్టికి అన్నీ సృష్టంగా కన్పిస్తునే వుంటాయి. అన్ని ప్రాణులు అతని శక్తి వలననే పుడతాయి, గిడతాయి కూడ. అతడు అన్నిటినీ అదుపులో వుంచుకొంటాడు. ఇంకా అతడు మన హృదయంలోనే వసిస్తుంటాడు. మన జీవితకాలమంతా భగవంతుని యెదుటనే గడుపుతుంటాం గనుక విశ్వాస దృష్టితో భయభక్తులతో మెలుగుతుండాలి. 2) దైవసాన్నిధ్యాన్ని పాటించే తీరు దేవుణ్ణి మనచుట వున్న నరుల్లో గుర్తించాలి. మన ಮಿಟ್ಟು: ຂະ◌ຕື້ L