పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంరక్షణంలో వుండడం మహాభాగ్యం అనుకోవాలి. మనం కంటితో చూడకపోయినా వాళ్లు నిరంతరం మన ప్రక్కనే వుండి మనకు సేవలు చేస్తుంటారు. నిజం చెప్పాలంటే మనకు వాళ్లను మించిన బంధువులుగాని స్నేహితులుగాని వుండరు. ఆలాంటి ఆప్తులపట్ల మనం కృతజ్ఞత కలిగి వుండాలి. రోజూ ఉదయసాయంకాలల్లో వారిని స్మరించుకొని నమస్కారం చెప్పాలి. సన్మస్కులపట్ల భక్తీలేనివాళ్లు చాలపరలోక భాగ్యాలూ సదుపాయాలూ కోల్పోతారు. 6. ఆధ్యాత్మిక నరులు - లౌకిక నరులు లౌకిక జీవితం కరుకైంది. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జీవితం చాల సున్నితమైంది. జాగ్రత్తా చురుకుదనమూ కలవాళ్లేగాని ఈ బాటలో నడవలేరు. నిరంతరం దేవుని వరప్రసాదం మనలను ప్రేరేపించి పారమార్థిక విషయాలవైపు ఆకర్షిస్తూ వుంటుంది. పవిత్రాత్మ ప్రేరణలు పుట్టించి హృదయాన్ని క్రీస్తువైపు త్రిప్పతూ వుంటుంది. దేవదూతలు ప్రబోధాలు కలిగించి మనస్సుని దేవుని వైపు మరల్చుతూంటారు. ఈ స్పందనలన్నీ మన ఆత్మలో కలుగుతూంటాయి. ఐనా లౌకిక మానవులు వీటిని అసలు గుర్తించనే గుర్తించరు. ప్రాపంచిక వ్యామోహాలనే ప్రవాహంలో పడి కొట్టుకొని పోతుంటారు. ఆత్మల వివచేనం అలవడాలంటే దేవుని మార్గాల్లో నడవాలి. భగవంతునివైపు దృష్టి మరల్చాలి. ఈ సందర్భంలో ఆధ్యాత్మిక నరుల పోకడలు ఏలా వుంటాయో, లౌకిక నరుల పోకడలు ఏలా వుంటాయో తెలుసుకొని వుండడం అవసరం. ఈ క్రింది లక్షణాలను బట్టి మనం ఏలాంటి నరులమో పరిశీలించిచూచుకోవచ్చు. ఆధ్యాత్మిక నరులు లౌకిక నరులు నిరాడంబరం - డంబమూ, డాబూ ఆత్మనిగ్రహం - విచ్చలవిడిగా తిరగడం అధికారానికి లొంగడం - లొంగకపోవడం