పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కష్టం. కాని అది జీవానికి కొనిపోతుంది. చాలమంది మొదటి దానిలోను కొద్దిమంది రెండవదానిలోను ప్రయాణం చేస్తారు -మత్త 7,13-14. మనకు ఇంద్రియ సుఖాలు ముఖ్యమా లేక నిగ్రహం ముఖ్యమా అని పరిశీలించి చూచుకోవాలి. ఇది కూడ వివేచనమే. మనలో బుద్ధి శక్తి, చిత్త శక్తి మొదలైన ఉన్నత శక్తులు వుంటాయి. పిశాచాలు దేవదూతలు వాటిని నేరుగా తాకలేరు. దేవుడు మాత్రమే వీటిని ముట్టగలడు. మనలో సుఖదుఃఖాది ఉద్వేగాలు, జ్ఞాపకశక్తి, మొదలైన סחco& అల్పశక్తులు కూడ వుంటాయి. పిశాచాలు వీటిని నేరుగా తాకగలవు. అవి వీటిద్వారానే మనలను ఎక్కువగా శోధిస్తాయి. కన్ను చెవి, ముక్కు నాలుక చర్మం మొదలైన పంచేంద్రియాలు, వాటి క్రియలైన చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర మొదలైన క్రియలద్వారానే దయ్యం మనలను అధికంగా శోధిస్తుంది. కొందరికి సున్నితమైన మనస్తత్వం వుంటుంది. వీళ్లు తప్ప చేయకపోయినా చేశామేమోనని ఆందోళనం చెందుతారు. పిశాచం వీళ్లను అట్టే శోధించదు. దీనికి భిన్నంగా కొందరికి మొద్దువారిన మనస్తత్వం వుంటుంది. వీళ్లు తప్పుచేసికూడ పట్టించుకోరు. చావైన పాపం చేసికూడ అది చిన్నపాపమేలే అనుకొని ధీమాగా వుండిపోతారు. దయ్యం ఈ వర్గం వాళ్లను అధికంగా శోధిస్తుంది. కనుక మొద్దువారిన మనస్తత్వం కలవాళ్లు సున్నితమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. 4. పవిత్రాత్మ ప్రేరణలు ఈ క్రింద ఆధ్యాత్మిక రచయితల భావాలు కొన్నిటిని పొందుపరచాం. బైబుల్లో ఇద్దరు నాయకులు సంప్రదాయం వుంది. మొదటి నాయకుడు పోతూ రెండవ నాయకుణ్ణి నియమిస్తాడు. ఈ రెండవ నాయకుడు మొదటి నాయకుని పనినే కొనసాగిస్తాడు. మోషే పనిని యోషువా ఏలీయా పనిని యెలీషా కొనసాగించారు. ఈలాగే క్రీస్తు తండ్రి వద్దకు పోతూ పవిత్రాత్మను