పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వదలి వేస్తారు. ప్రకృతి ప్రీతి, జ్ఞానార్జనం, ధనార్జనం, విజ్ఞానశాస్త్రం, పరిశ్రమలు స్థాపించడం మొదలైన వాటిమీద మనసు నిల్పి దేవుణ్ణి పట్టించుకోరు. ఇది కూడ అపమార్గమే. మరి కొందరు భోగవాదులు. వీళ్లు సంతోషంగా వుంటే చాలు అనుకొంటారు. మనసు ఆనందంగా వుంటే చాలు ఇక దేవుడెందుకు అని వాదిస్తారు. ఇది వొకరకమైన స్వార్ధం. వేరుకొందరు దేవుణ్ణి విడనాడరు కాని సుఖమార్గంలో పోవాలను కొంటారు. ఇంద్రియాలను సుఖపెట్టడం ముఖ్యం అని భావిస్తారు. నిగ్రహాన్ని ఏ మాత్రం పాటించరు. సిలువను పూర్తిగా వదలి వేస్తారు. కాని సిలువ ඵ්රයී రక్షణం లేదు. దేవుడంతటి వాడు బుద్ధి పూర్వకంగా సిలువ మార్గాన్ని ఎన్నుకొన్నాడు. మరికొందరు ఉద్వేగాలను అనుభవించడమే ఆధ్యాత్మికత అని భ్రాంతి పడతారు. పెద్ద పెద్ద బృందాల్లో ప్రార్థనలు చేస్తే, కమ్మని సంగీతంతో పాటులు పాడితే, నాట్యం చేస్తే, చప్పట్ల కొడితే ఒక రకమైన ఆవేశమూ తన్మయత్వమూ కలుగుతాయి. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఉద్వేగాలకు లొంగడమంటే యిదే. కాని యీ స్థితి ఆధ్యాత్మికత కాదు. ఇది తాత్కాలిక స్థితి. ఇది దీర్ఘకాలం నిలిచేది కాదు. ఆధ్యాత్మికత జీవితకాలమంతా శ్రమజేసి సాధించేది. మన మనసు హాయిగా వుంది అనిపించుకొనేది కాదు. తోడివారి కష్టసుఖాలను అక్కరలనూ పట్టించుకొనేది. ఆధ్యాత్మిక రంగంలో అపమార్గాలు ఇంకా వున్నాయి. నిజమైన భక్తిమార్గంలో భగవంతుణ్ణి పూజించడం వుంటుంది. తోడినరుల కష్టాలనూ అక్కరలనూ తీర్చడం వుంటుంది. ఈ లక్షణాలను బట్టే నిక్కమైన ఆధ్యాత్మికతను గుర్తించవచ్చు.