పుట:Adhunikarajyanga025633mbp.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రజాప్రతినిధులచే కూడిన పార్లమెంటునధికారము కలదని స్థిరపరుపబడెను. ఈవిధముగ కార్యనిర్వహకవర్గపు ప్రధానాధికారినే ప్రజాప్రతినిధు లెన్నుకొనుట కధికారముకల్గెను. రాజు తన యిష్టమువచ్చినట్లు, తనకార్యనిర్వాహకవర్గ మేర్పరచుకొని, వారిచే రాజ్యాధికారమును ప్రజలపీడించుట కుపయోగింపకుండుటకై ప్రభుత్వనిర్వహణమునకు వలయుధనమును సంవత్సరమునకొకమారు పార్లమెంటుయొక్క అనుమతిపై నిర్ధారణకాబడు శిస్తులద్వారా పొందవలసివచ్చెను. ప్రజల నస్వతంత్రులుగాజేసి నిరంకుశాధికారమును సైనికబలగములసాయముతో రాజు నేర్పరతురేమో యనుభయముచే సైన్యము నెట్లు నడుపనగునో నిర్ణయించు నియమములబిల్లును ప్రతివత్సరము పార్లమెంటు అంగీకరింపవలయునని నిర్ణయింపబడెను. న్యాయాధిపతిగానుండి "స్టారుఛేంబరు" అను కౌన్శిలుద్వారా ఏడవ హెన్రీరాజుగారు, ప్రజలను, వర్తకులను తనయిచ్చవచ్చినట్లు కోర్టులకీడ్చి, జుల్మానాలకు లోనుగాజేసి, నానాయిబ్బందుల గల్గించుచుండెను. ధనలోపముచే బాధబొందుచుండిన ప్రధమఛార్లెసుగారి నిరంకుశ అశాస్త్రీయ "స్టారుఛేంబరు" న్యాయాధిపత్యమును వహించిరి. ఇట్టి దుర్మార్గమును అరికట్టుటకై "రక్తరహితవిప్లవము" (1688) "హబీసుకార్పొసు ఆక్టు" అను శాసనము కూడా నిర్మింపబడినది. దీనిప్రకారము ఏపౌరుడైనగాని తప్పులేనిదే, ఏదే