పుట:Adhunikarajyanga025633mbp.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

డెడివారు. కాని, శాసననిర్మాణాధికారము భారతకాలమువరకు రాజులకు లేదాయెను. కార్యనిర్వాహణాధికారము, న్యాయాధిపత్యము మాత్రము రాజ్యాంగమునకు చెందియుండ, కార్యనిర్వాహణము బ్రాహ్మణులసలహాలపైనను, న్యాయాధిపత్యము బ్రాహ్మణుల సహకారముతోడను, రాజులు నెరపుచుండిరి. అటులనే చైనాదేశమందు కూడ కార్యనిర్వహణము, న్యాయాధిపత్యము జిల్లారాష్ట్రీయ జాతీయనాయకుల సలహాలననుసరించి, ఆదేశపు చక్రవర్తులు నెరపుచుండిరి.

ప్రపంచమందెల్లయెడలను, క్రీస్తుశకారంభమునకు సంపూర్ణనిరంకుశాధికారము రాజులకుదక్కుటయు, వారియందే యీ మూడువిధములగు పెత్తనములు అంతర్గర్భితమగుటయు, తన్మూలమున ప్రజలకు యిబ్బందులనేకము కల్గుటయు అనుభవముకాజొచ్చెను. ప్రజాస్వామిక రాజ్యాంగవిధానము బొందియున్న హాలాండుపట్టణములు, ఇటలీ పట్టణములలో కొన్నిటియందు తప్ప, ప్రజలకు ఈమూడు పెత్తనముల నడపురాజుల పాలనముక్రింద, ఎన్నో కష్టనష్టములు కల్గెను. ఏపౌరునైనను నిందితునిగా దూషించి, వానిని శిక్షార్హునిగా పరిగణించి, వానిపై శిక్షనుప్రయోగించు యధికారము రాజులకా కాలమున యుండెడిది. కనుకనే అలెగ్జాండరు చక్రవర్తినుండి అక్బరుచక్రవర్తివరకు,