పుట:Adhunikarajyanga025633mbp.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాయకుల నెన్నుకొనుచు, యాన్యాయముల విచారించుటకై ప్రత్యేకన్యాయాధిపతులుగా సమావేశమగుచుండిరి. ఇటులనే రోమన్ రాజ్యమందు కూడ క్రమముగా శాసననిర్మాణముజేయుటకొక సమాహము, కార్యనిర్వాహణము నెరపుటకు మరికొందరు ప్రజానాయకులు, న్యాయస్థానములందాధిపత్యమువహింప కొందరు ప్రముఖులు నియమింపబడుచుండిరి. పెట్రిషియనులకే ధర్మమాత్రజ్ఞానముండుటవలన, ప్రజలందరు వారిపైననే ఆధారపడియుండుట ప్రజలకు క్షేమముకాదని, ఏబదిమంది పెద్దలసంఘమువారిచేత పన్నెండు 'టేబుల్సు' అనుధర్మసూత్రసముదాయములను గ్రంథస్తముచేయించిరి. అప్పటి నుండియు, శాసననిర్మాణముచేయుసంస్థలు కార్యనిర్వాహక వర్గమునుండియు, న్యాయమూర్తులవర్గమునుండియు వేరుపరచియుండిరి. మనదేశమందును, చైనాదేశమందును ఆదిమకాలమందే కుటుంబపెద్దలనుండి 'కుదురు'ల పెద్దల పెత్తనమువచ్చువరకు, ఒకేయధికారికి యీమూడుపెత్తనములు చెందియుండెను. క్రమముగా గ్రామపంచాయతీ జిల్లాపంచాయితీల కీమూడుపెత్తనములు దక్కెను. రానురాను మనదేశమందు ధర్మసూత్రసముదాయము ప్రాముఖ్యతకొచ్చినకొలది, వానిజ్ఞానము బ్రాహ్మణులకే సమగ్రముగా కల్గియుండుటచే, వారిసలహాలపైని సహకారతో రాజులు న్యాయాన్యాయ పరిపాలనముచేయుచుం