పుట:Adhunikarajyanga025633mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దు లిఖింపబడినట్లు ప్రభుత్వములుగాని, ప్రజలుకాని ప్రవర్తించకపోవుట సాధ్యమే ! జర్మనీయందు రాజ్యాంగవిధానపు చట్టముయొక్క మూలసిద్ధాంతములకే భంగకరముగా నుండునట్లు శ్రీ ప్రెసిడెంటు హిండెన్ బర్గుగారు వారిప్రధానమంత్రులు శ్రీ బ్రూనింగు, శ్రీపెపిరుగారలు శాసనసభల నంత మొందించి ఆర్డినెన్సుల నిర్మించి, ప్రషియారాష్ట్రపు మంత్రాంగవర్గమును పదభ్రష్టతనొందించి, తమకిష్టమగు నాజీపార్టీవారిని బలపరచుట అనుభ వైక వేద్యము. అటులనే పోలాండునందును చెకోస్లావాకియాయందును, తదితరబాల్కనురాష్ట్రములందును తమరాజ్యాంగవిధానపు చట్టములందేకాక, నానాజాతిసమితివారిచే చేయబడిన రాజీపత్రములందుకూడ ఖాయపరచిన అల్పసంఖ్యాకుల పౌరసత్వపుహక్కుల నాయాదేశముల ప్రభుత్వములు సంకుచితపరచుచున్నవి. ఫ్రాన్సు నందును అమెరికాయందు నిట్టే రాజ్యాంగవిధానపు చట్టములకు విరుద్ధముగా, ప్రభుత్వములు ప్రవర్తించుటకు సాహసించినవి.

ఇట్టి పౌరసత్వపు హక్కు బాధ్యతలు చెక్కుచెదరకుండా అనుభవములోనికి రావలెనన్న వానిరక్షణార్థమై పౌరులును, వారిసంస్థలును తమలో కల్గుచుండు వివాదములమరచి అట్టిహక్కులపై దాడియెత్తు ప్రభుత్వముల, ఉద్యోగుల తగురీతి నెదుర్కొనుటకు పూనుకొనియుండవలెను.