తంత్ర్యములెట్టివో చెకోస్లావాకియా రాజ్యాంగవిధానపుచట్టమందు పేర్కొనబడియున్నవి. (1) స్త్రీపురుషభేదముల గమనింపరాదు. మతము, గ్రామము, జాతి, భాషాభేదముల గమనించక, ప్రజలయొక్క జీవారక్షణ కల్గించి వారికి స్వాతంత్ర్యము ప్రసాదించుట రాజ్యాంగముయొక్క ధర్మము. (2) ఉద్యోగముల ననుసరించి మాత్రమే బిరుదులనివ్వవలెను. (అన్ని రిపబ్లికులందును ఈనియమముకలదు).(3) శాసనబద్ధముగా తప్ప, ఏవ్యక్తియొక్క స్వాతంత్ర్యమును తగ్గింపరాదు. (4) ప్రభుత్వ కార్యనిర్వాహణమునకై నిర్భంధించరాదు. (5) ప్రతిపౌరుడును దేశమందెచ్చోటనైన ఆస్థి సంపాదించుకొని గృహమునిర్మించుటకు హక్కుకలదు. సంఘావసరములకే, శాసనబద్ధముగానున్నప్పుడు అట్టిహక్కును సంకుచిత పరచనగును. (6) వ్యక్తిగతమగు ఆస్తిని శాసనబద్ధముగనే సంకుచితపరచవచ్చును. అట్టిఆస్తిని ప్రభుత్వము వశపరచుకొనుచో ప్రతిఫలము ఆయావ్యక్తులకు చెల్లింపవలెను. (జర్మనీయందు నిట్లే) రాజ్యాంగవిధానపు చట్టసవరణద్వారా తప్ప వేరువిధమున ఈహక్కును తగ్గించుటకు వీలు లేదు. (7) విదేశములకు వెళ్లుటకు పౌరులకుండు హక్కు శాసనముద్వారానే తగ్గింపవీలగును.(8) ప్రభుత్వముచే వేయబడు శిస్తులు రుసుములు శాసనబద్ధముగ నుండవలెను. (9) నివాసమునకై నిరూపింపబడు గృహముల నెవ్వరును ఆగృహస్థుని యాజ్ఞ
పుట:Adhunikarajyanga025633mbp.pdf/90
Appearance