పుట:Adhunikarajyanga025633mbp.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లందు పేర్కొనబడు, పౌరులకు, రాజ్యాంగములకు పరస్పరముగానుండు హక్కు బాధ్యతలకు సంబంధించిన సూత్రముల రీతి తెలియనగును. (1) పోలాండు రాజ్యాంగమందు పౌరుడుగానున్న వ్యక్తి మరేయితర రాజ్యాంగమునకు చెందరాదు. (2) పోలాండు రిపబ్లికునకు విశ్వాసులైయుండుట, పౌరుల ప్రధానధర్మము. (3) రాజ్యాంగచట్టము, దానిననుసరించి నిర్మింపబడు శాసనములు, ప్రభుత్వనియమముల ననుసరించియే పౌరులెల్లరు ప్రవర్తించుకొనవలయును. (4) ప్రతిపౌరుడును సైనికశిక్షణమును బొందవలయును. (5) శాసనబద్ధముగానుండు శిస్తులను ఆతడు చెల్లింపవలెను. (6) రాజ్యాంగసంస్థలదెద్దియైన కోరు సహకారముచేయుటకును, రాజ్యాంగసేవ, అగత్యమైనప్పుడు చేయుటకును అతడు సంసిద్ధుడైయుండవలెను. (7) బిడ్డలందరకు ప్రైమరీవిద్యనైననొసంగి పౌరసత్వముబొందుట కర్హతకల్గించుట పౌరులధర్మము.

రాజ్యాంగవిధానము, ప్రజలయెడజూపదగు బాధ్యతను, జర్మను రాజ్యాంగవిధానపుచట్టము సమగ్రముగా నిరూపించు చున్నది. (1) కుటుంబముల యభివృద్ధినికాక్షించి, గొప్పకుటుంబములరక్షించుట రాజ్యాంగపుధర్మము. (2) తల్లి దండ్రులు తమబిడ్డల సలక్షణముగా పెంచునట్లు జాగ్రత్తపడి, బిడ్డలందరి ఆరోగ్యవిద్యాభివృద్ధికల్గుటకు, రాజ్యాంగము శ్రద్ధచేయవలెను. (3) తగు శాసననిర్మాణముచే, తండ్రిలేని