పుట:Adhunikarajyanga025633mbp.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చు ప్రజలకు ప్రసాదించి, బీదలబిడ్డలపోషించి క్రమక్రమముగా హెచ్చుచున్నపౌరులకు వయోజన విద్యాప్రాప్తికల్గింప బడుచున్నది. (2) ప్రజల రాచకీయ విజ్ఞానాభివృద్ధికై రాచకీయకక్షలు సర్వస్వతంత్రతబొంది తమప్రచారముజేయుటకు హక్కుబొందియున్నవి. (3) కృషిచేసి జీవనోపాధి నొందుయవకాశము ప్రతిపౌరునకు, ప్రభుత్వము కల్గించుటకు కంకణముగట్టుకొని, నిరుద్యోగనివారణ కార్యక్రమమవలంబించి, నిరుద్యోగులకు రక్షణకల్గించుచున్నది. వృద్ధులకు, అనాధలకు, అట్టివారికి శరణ్యము కల్గించుచున్నది. వీరందరికి, పౌరసత్వపుహక్కును ప్రసాదించుచున్నది. (4) పుట్టుకతో సంబంధము లేకుండా, అర్హులగువారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించుటకు బ్రయత్నించుచున్నది. ప్రజలు తనయెడ జూపదగు ధర్మములగూర్చిన చింతలేకయే ఆప్రభుత్వమున్నది. క్రిందటియుద్ధమందును, 1926 నందు సభవించిన "జనరలుస్ట్రైకు" నందును, ప్రజలు ఆ దేశపు రాజ్యాంగము రక్షించుటచే నడుముగట్టి నిలబడిరి.

తమరాజ్యాంగవిధానములను చట్టరూపముగా బొందియున్న దేశములలో పోలాండుయొక్కచట్టమే, పౌరులహక్కు బాధ్యతలగురించి నిండువివరముల నొసంగుచున్నది. కనుక ఆదేశపురాజ్యాంగ విధానమునందలి విశేషములకొన్నిటినిచ్చట పేర్కొన్నచో, ఈకాలపు రాజ్యాంగవిధానపు చట్టము