పుట:Adhunikarajyanga025633mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమానాదరతజూపి, రాజ్యాంగతత్వపు ప్రౌడత్వమును, ప్రజాస్వామిక రాజ్యాంగముయొక్క సార్థకతనుఋజువు చేయుచున్నది.

ఎట్టెట్టిబాధ్యతల రాజ్యాంగము నిర్వర్తింపవలయునో పౌరుల స్వత్వముల నెంతవరకు గౌరవించవలెనో, సంపూర్ణముగా విచారించుట కిదియదనుకాదు. "అమెరికా ప్రభుత్వము", "జర్మనుప్రభుత్వము"లపై వ్రాయబడిన గ్రంథములందు, అయాప్రభుత్వము లేయే పౌరసత్వహక్కుల సురక్షితపరచి రాజ్యాంగబాధ్యతల నెరవేర్పవలసియున్ననో, సంపూర్ణముగ వివరములొసంగ బడినవి. రాజ్యాంగవిధానపుచట్టము నెరుంగని ఇంగ్లాండుదేశమునందు, ఏయేపౌరసత్వపుహక్కులు ఆచరణయందు అనుభవనీయమగుచున్నవో యీక్రిందనుదహరింపబడినది.

(1) పౌరులెల్లరు తమతమసంఘముల నేర్పరచుకొనుటకు, తమయభిప్రాయముల పత్రికలవలన, కరపత్రముల రూపకముగా, సభలద్వారా తెల్పుటకు స్వతంత్రతకలిగియున్నారు. (2) వార్తాపత్రికాప్రచురణ స్వాతంత్ర్యముకలదు. (3) మతస్వాతంత్ర్య మేర్పడినది. (4) ఆర్థిక జీవితరక్షణకై కార్మికులు సమ్మెకట్టుటకు స్వాతంత్ర్యము బొందియున్నారు. వీనికితోడు రాజ్యాంగ మీక్రింద నుదాహరింపబడిన బాధ్యతలను, పౌరుల స్వతంత్ర్యతకై సర్వసమానత్వలబ్ధికై నెరవేర్చుచున్నది:- (1) నిర్భంధ ప్రారంభవిద్యను