పుట:Adhunikarajyanga025633mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థిరస్థాయి యగుటకు, ప్రజలు దానియెడ జూపదగు ధర్మముల గురించి రాచకీయజ్ఞులు శ్రద్ధజేయుచున్నారు. ప్రజలెల్లరు తమ రాజ్యాంగవిధానమును రక్షించుకొనుటకును, నిలబెట్టకొనుటకును సకలప్రయత్నములజేయ సంసిద్ధులుకానిచో, ఇటలీయందు ప్రజాస్వామిక మదృశ్యమైనటుల, జర్మనీయందు నిరంకుశపుపెత్తనము రానైయున్నటుల, పోలండు, బల్గేరియాలందు ప్రజాస్వామికము అంతమొందినటుల, ప్రజలకు ప్రజాస్వామికరాజ్యాంగమే దక్కకుండునని, రాచకీయ నాయకులు, రాచకీయజ్ఞులు కన్గొనుచున్నారు. కనుకనే జర్మనీ, పోలండు, రాజ్యాంగవిధానచట్టములందు పౌరులు, తమ రాజ్యాంగముయెడ, తమ సంఘముయెడ నెఱపవలసిన ధర్మములు పేర్కొనబడుచున్నవి. ఆదిమకాలమందు మనఋషులు ప్రజలు రాజునెడజూపదగు బాధ్యతలను నిరూపించిరి. అటులనే శ్రీప్లేటోగారును, పౌరులెల్లరికి తమతమ బాధ్యతల నిర్వర్తించు విధానము నేర్పరచవలెననిరి. క్రైస్తవప్రపంచసౌర్వభౌమత్వమువహించిన పోపుగారును, పౌరుల బాధ్యతల పేర్కొనిరి. కాని, ఆకాలపువారు పౌరులయెడల రాజ్యాంగము నెఱపవలసిన ధర్మములను సంపూర్ణముగా నిర్వచింపరైరి. పోలండు, జర్మనీదేశముల రాజ్యాంగవిధానపు చట్టములు, రాజ్యాంగవిధానముల హక్కు బాధ్యతలను, పౌరులయొక్క హక్కుబాధ్యతలను పేర్కొని, ఇరుపక్షములయెడ