పుట:Adhunikarajyanga025633mbp.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రేఖలు, వన్నెచిన్నెలు సంపూర్ణముగా పెంపొందియేయున్నవి. ఆ రాజ్యాంగవిధానమునందే పౌరసత్వపు హక్కులు యిమిడియున్నవి. ఆసాంప్రదాయమునే బ్రిటిషువారి ప్రజాస్వామిక రాజ్యములన్నియు పొందియున్నవి. కనుకనే ప్రత్యేకముగా నట్టి పౌరసత్వపుహక్కులు ఆయాదేశముల రాజ్యాంగవిధానపు చట్టములందు పేర్కొనబడలేదు. రెండవకారణమేమనగా, ఫ్రాన్సునందు అకస్మాత్తుగా కల్గిన రాజ్యాంగవిపత్తు బాపుకొనుటకై త్వరితగతి రాజ్యాంగవిధానమును నిర్మించుటకై ప్రయత్నము జేయబడుటచే ఈరాజ్యాంగవిధానపు ధర్మములందు బేర్కొనబడలేదు.

ఇప్పటివరకు పాశ్చాత్యదేశములందేకాక, ఆథునిక ప్రపంచమందంతటను ప్రజలయొక్కయు, పౌరులయొక్కయు, హక్కులగూర్చియే, రాజకీయజ్ఞులు శ్రద్ధవహించుచున్నారు. ఇందులకు గారణములేకపోలేదు. నిరంకుశాధికారులక్రింద నవసియపని మెజారిటీల దుష్పరిపాలనముక్రింద యవస్థపడియున్న ప్రజలకు, తాము తమ ప్రభుత్వమునెడల జూపవలసిన బాధ్యతనుగురించికాక (తామెల్లప్పుడు ప్రభుత్వాజ్ఞలకు తల యొగ్గుచునేయుండుటచే) తమయెడల ప్రభుత్వము జూపెట్టదగు దయను, శ్రద్ధనుగురించియే పట్టుదలకల్గియుండుటలో ఆశ్చర్యమేమికలదు! కాని యిప్పుడిప్పుడు, ప్రజాస్వామిక రాజ్యాంగము స్థిరపడుచున్నకొలది, ఆరాజ్యాంగవిధానము