పుట:Adhunikarajyanga025633mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిరాజ్యాంగవిధానమునందును, ఈమూడుధర్మములు పేర్కొనబడినవని చెప్పనలవికాదు. స్విట్జర్లాండు, అమెరికా, మెక్సికో, జెకోస్లావాకియా, జర్మనీ, ఎస్తోనియా, డెన్మార్కు, ఆస్ట్రియా, పోలండు, జుగోస్లావియా, బెల్జియము, ఐరిషు ఫ్రీస్టేటులయొక్క రాజ్యాంగవిధానముల చట్టములయందు ప్రథమరెండుధర్మములును పేర్కొనబడియున్నవి. జుగోస్లావియా, జర్మనీ, ఎస్తోనియా, రాజ్యాంగపుచట్టములందుమాత్రము మూడవధర్మము కొంతవరకు సూచింపబడుచున్నది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, దక్షిణాఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియాల యొక్క రాజ్యాంగవిధానములం దీరాజ్యాంగము యొక్క ధర్మములు ప్రత్యేకముగా పేర్కొనబడలేదు. ఇందులకు రెండుకారణములుకలవు. ఒకటి యుద్ధమునకు పూర్వము ఈశతాబ్దారంభమున యేర్పడిన రాజ్యాంగవిధానపుచట్టములందు, ఈధర్మములను (పౌరసత్వపు హక్కులని వీనినె అందురు) పేర్కొనుయలవాటు సర్వసాధారణము కాదాయెను. మరియు, బ్రిటిషువారి ప్రజాస్వామిక రాజ్యాంగములందు పౌరసత్వపుహక్కులిట్టివి అనుజ్ఞానము, ఆచారవశాత్తు ప్రజలకు కల్గియుండుటయు, ఆచారానుగతముగా నట్టిహక్కుల నాయాదేశముల రాజ్యాంగములు గౌరవించుచుండుటయు సర్వసాధారణమైయుండెను. ఇంగ్లాండుయొక్క రాజ్యాంగవిధాన మీనాటికిని చట్టరూపముదాల్చకున్నను దానియొక్కరూపు