పుట:Adhunikarajyanga025633mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెర్రిపట్టణమందలి ప్రత్యర్థినాయకులు తరిమివేయబడిరి. అమెరికాయందలి కార్మికసంఘములందొక్క విధమైన సంఘ నాయకులను వెదకి వెదకి చెరసాలయందు పెట్టుట కలదు. ఈనాటికిని కమ్యూనిస్టుపార్టీల రాచకీయాందోళనము నాపుట కనేకదేశములందు ప్రబల ప్రయత్నములు చేయబడు చున్నవి. ఐర్లాండునందిప్పటికి స్వతంత్రాలోచనను పురిగొల్పు గ్రంథములు బహిష్కరింపబడుటయు, స్వతంత్రరచనాకౌశలులగు గ్రంథకర్తలు అవమానింపబడుటయు జూడనగును. మనదేశమందు పంచముల కింకను సాధారణసాంఘిక, నైతికస్వత్వములు దక్కకున్నవి. అమెరికాయందు నీగ్రోజాతివారు, దక్షిణాఫ్రికాయందు భారతీయులు, నీగ్రోలు ఈనాటికిని కడుంగడు కడగండ్లకు లోనగుచున్నారు. బాల్కనురాష్ట్రములందలి రాష్ట్రేతరభాషలకు జెందిన ప్రజలకు, వారిభాషాప్రచారమును, ఆయాప్రభుత్వము లిప్పటికిని ఆటంకపెట్టుచున్నారు. జపానునందు కార్మికసంఘముల స్థాపనను ప్రభుత్వము ప్రతిఘంటించుచున్నది. ఇట్టి అపకారములు ప్రజలకు జరుగకుండుటకై, రాజ్యాంగవిధానపు చట్టమునందే తగునియమముల నేర్పరచు టగత్యము.

నిరంకుశులగు చక్రవర్తు లెట్లు అజ్ఞానులై ప్రజల కపచారములు చేయదొరకొందురో, అల్పసంఖ్యాకులగు రాజ్యాధికారులు తమకు పెరజాతివారగువారిపై నిర్భంధ