పుట:Adhunikarajyanga025633mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గల్గి, స్వవినాశనకరమగు సవరణలను విప్లవముకల్గింపకయే నిరాకరించు శక్తికల్గి యుండుటయందే గాననగును. అపారమును, అపురూపమునగు రాజ్యాంగ సంస్కరణలు, ఇంగ్లాండునందు, రాజ్యాంగవిధానము మూలమునను, సక్రమపద్ధతుల ననుసరించియు మాత్రమే ఏర్పరుపబడినవన్నచో, ఆరాజ్యాంగవిధానపు సమర్థతయు, సౌష్టవమును కొనియాడతరమా? సక్రమరాజ్యాంగాందోళనమునం దంతగా నమ్మికలేని లేబరు పార్టీవారుకూడ, ఆస్ట్రేలియాయందు రాజ్యాంగవిధానమును గౌరవించుచున్నారన్నచో రాజ్యాంగవిధానమును సవరించుటకు అనువైయున్నదను నమ్మకమే అందులకు ముఖ్య కారణము.

తనస్వరూపమును తానే తనవృద్ధికారకముగనే మార్చుకొనుశక్తి ప్రతి రాజ్యాంగవిధానమునకు నుండుట అత్యంతావశ్యకమని జూచితిమి. ఇక నిప్పుడట్టి రాజ్యాంగవిధానపు చట్టమునందు ఏయే ముఖ్యభాగము లగత్యమో చూడవలసియున్నది. ఆధునిక రాజ్యములందును ప్రజాస్వామికరాజ్యములందును, 'మెజారిటీ' యందున్న పార్టీవారు అల్పసంఖ్యాకులయొక్క స్వత్వముల గౌరవించుటకు, వారి సంస్థల రక్షించుటకు అంతగా ఆతురతజూపుట లేదు. గ్రీసు దేశమందు ప్రత్యర్థిపక్షపు నాయకుల దేశమునుండి వెడల నంపుచుండుట యిప్పటికిని కలదు. మనదేశమందలి పాండి