పుట:Adhunikarajyanga025633mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కష్టించవలసివచ్చుచున్నది. అమెరికాపద్ధతుల బట్టిచూడ, రాజ్యాంగవిధానమునందు సవరణజేయింపవలెనన్న, కొన్ని తరములపర్యంతము, సంస్కారులు, అమితమగు బాధలకులోనై, సంస్కరణలకై కృషి చేయవలసియుండును. ఇట్టి కఠినమగు అగ్నిపరీక్షకు తాళుట దుస్తరము. కొందరు సంస్కారులు సక్రమాందోళనమే కూడదని, విప్లవకారులుగా మారవచ్చును. మరికొందరు, ఆశాభంగముచే స్వకార్య తత్పరులు కావచ్చును. తుదకు అమెరికాయందైనట్లే, ప్రజాసామాన్యము రాచకీయపరిణామములయెడ పూర్తిగా యుదాసీనులు కావచ్చును. విప్లవమెంతయనర్ధదాయకమో, ప్రజలు రాచకీయప్రపంచమున నిర్జీవప్రతిమలగుటయు అంత నష్టదాయకమే ! కనుక, రాజ్యాంగవిధానమునకు సంబంధించిన సవరణలు, శాసనసభలచే సాధారణపద్ధతి ననుసరించి కాని, మూడింట రెండువంతులమంది సభ్యులచే కాని, ఆమోదించబడినపిమ్మట, "రిఫరెండము"నందు ప్రజలయందు హెచ్చుమందిచే నంగీకరింపబడుట చాలును. అప్పటికే, అవసరమగు సవరణలు తప్పక వీగిపోవును. అవసరమగు సవరణలు, అంగీకరింపబడుసరికి, ఎన్నో వత్సరముల వయస్సు ప్రజాప్రచురజీవితమందు, ప్రతిబిల్లును పొందియుండును. రాజ్యాంగవిధానముయొక్క సౌష్టవము ఎల్లప్పుడును, అసాధారణ పరిస్థితులం దగత్యమగు సవరణల స్వీకరింపజాలు శక్తి