పుట:Adhunikarajyanga025633mbp.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుచుండ, గ్రుడ్లుమిటకరించి యూరకుండిరి. తుదకు ఇంగ్లాండునందైనను 1919 లోను, 1925 లోను, 1931 లోను, ప్రజలు తమతత్వము తామే యెరుంగక, వేలంవెర్రిగా, ఒకేపార్టీవారి నత్యధిక సంఖ్యాకులుగా యెన్నుకొని తమపై నిరంకుశాధికారపు పెత్తనము దెచ్చిపెట్టుకొని, మూల్గజొచ్చిరి. క్రీ. శ. 1931 లో నిర్మితమగు పార్లమెంటునకు రాజ్యాంగ విధానమునే మార్ప సర్వస్వాతంత్ర్యము, ఏయడ్డంకులు లేకుండ యుండుట ప్రజలకు నష్టదాయకమని వేరుగా చెప్పవలెనా? మంత్రివర్గమునకు చెందిన పార్లమెంటు సభ్యులు పదింట తొమ్మిదిమందియు, ప్రతికక్షికిజెందిన వారు. మిగతాఒక్కరిని పొందియున్నంత కాలము, రాజ్యాంగవిధాన సంస్కరణ న్యాయబద్ధముగ జరుగునని యెవ్వరునమ్మగలరు?

మొత్తముమీద సాధారణశాసనముల నిర్మించుటకంటె రాజ్యాంగవిధానపుచట్టమును సవరించుట కష్టతరమై యుండుట అవసరమేకాని, అమెరికాయందును, ఆస్ట్రేలియా యందును, తుదకు స్విట్జర్లాండునందు నేర్పరుపబడిన ప్రత్యేకపు ఆటంకములుమాత్రము, సక్రమమును అవసరమునగు సవరణలు, ప్రజలచే అంగీకరింపబడకుండునట్లుచేసి, ప్రజల సహజాభివృద్ధి కాటంకకరములుగా నుండుటకుకూడ అభిలషింపదగిన పద్ధతి కాదు. ఈదినములందు సామాన్య శాసనమును నిర్మించుటకే సంస్కారులు, పదివత్సరములపాటు