పుట:Adhunikarajyanga025633mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను సభ్యరాష్ట్రములందు నాల్గింట మూడువంతులు వానిని అంగీకరించవలెను. ఈవిధముగా నియమముల పాటించి, సవరణలు ప్రతిపాదించి, వానినంగీకరింపజేయుట బ్రహ్మాండమగు కార్యమగుచున్నది. కనుకనే ఇంతకాలమునందు పందొమ్మిదికంటె హెచ్చుసవరణలు అంగీకృతముగా లేదు.

II

ఇంగ్లాండాదిగాగల దేశములందువలె, రాజ్యమునకంతకు మూలాధారమె ప్రజలెల్లరకు పరమప్రామాణమగు రాజ్యాంగ

పౌరసత్వ
హక్కు
బాధ్యతలు.

విధానమును, సాధారణశాసనముల మార్చురీతినే మార్చుటకు పార్లమెంటున కధికారమిచ్చుట, ఈకాలపుప్రజల వైఖరినిబట్టి చూడ ధనికుల, భూస్వాముల నిరంకుశాధికార ప్రేమ గమనించిన, శ్రేయోదాయకముగా గన్పట్టుట లేదు. చాలాకాలమునుండి బాధ్యతాయుత సంస్థలద్వారా రాచకీయవిజ్ఞానముబొంది, వెనుకముందుల గమనించి వ్యవహార మొనర్చు ఇంగ్లీషుప్రజల కిట్టిసంపూర్ణ స్వాతంత్ర్య మొసంగుటవలన, విపరీతపరిస్థితులు కల్గుట లేదుగాని, ప్రజాస్వామిక సంస్థల నడపుటలో హెచ్చుయనుభవము లేక, దాస్యపు బుద్ధిని దూరముచేసికొన లేక, స్వత: రాచకీయరంగమున త్యాగముచేసి విజ్ఞానముబొంద నిచ్చగింపని ఇటాలియను ప్రజలు, తమరాజ్యాంగము నిరంకుశ పాలకుల హస్తగతమ