పుట:Adhunikarajyanga025633mbp.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వారిలో మూడింట రెండువంతులమందిగాని దానినంగీకరింప వలెను). కానియీ "రిఫరెండము" పద్ధతిని 1928 లో తీసివేసిరి. సంధిపత్రమునకు విరుద్ధమగు సవరణ నెద్దానిని ప్రతిపాదింపరాదు. కాని "ప్రమాణనిరాకరణ" బిల్లు సంధిపత్రమునకు విరుద్ధమని వాదించువారు కొందరుకలరు. "రిఫరెండము" తీసి వేయబడినపిమ్మట, ఈదేశపు రాజ్యాంగవిధానము, ప్రథమతరగతి రాజ్యాంగములకే చెందును.

ఆస్ట్రేలియాదేశపు సమ్మేళన రాజ్యాంగము బ్రిటిషు పార్లమెంటుయొక్క 1920 వ సంవత్సరపుచట్టము ప్రకారమేర్పరుప

11. ఆస్ట్రేలియా
రాజ్యాంగము.

బడినది. కొన్ని రాజ్యాధికారముల మాత్రము సమ్మేళన ప్రభుత్వమునకిచ్చి మిగిలిన రాజ్యాంగాధికారమంతయు సభ్య రాష్ట్రములకీ చట్టముప్రసాదించెను. ఈసమ్మేళనమందిప్పుడు ఆరుసభ్య రాష్ట్రములుకలవు. ఈరాజ్యాంగవిథానపు చట్టమును సవరించుటకు సమ్మేళనరాజ్యపు శాసనసభలు రెండును అంగీకరించవలెను. పిమ్మట ప్రజాప్రతినిధిసభకు సభ్యులనెన్నుకొను వోటరులందరు తమ 'రిఫరెండము' ద్వారా తమతమరాష్ట్రములందు తమయిష్టాయిష్టముల నాసవరణపై తెలుపవలసి యున్నను, ఈవిధముగానందరిచే నంగీకరింపబడిననేకాని ఏసవరణయు చట్టభాగముగా పరిగణింపబడదు. ఒక వేళ రెండు శాసనసభలమధ్య భేదాభిప్రాయముగల్గి, ఒక సభవారు వివా