పుట:Adhunikarajyanga025633mbp.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వేశముకావలెను. ఈక్రొత్తసభయందును సభ్యులందరిలో సగముమందికిమించి మరొక్కసభ్యుని యామోదముబొందుచో నట్టిసవరణబిల్లు చట్టమగును. పోలాండునందువలెనే, ఈదేశమందును, వివిధభాషల, జాతుల ప్రజలమధ్య సామరస్యము కలుగు కుండుటచేతను, ప్రజలకు రాజకీయవిజ్ఞానము లేక పోవుటచేతను నిరంకుశ రాజ్యమేర్పడినది. ఇచ్చటశ్రీకారులె రాజుగారే నిరంకుశాధికారియైనాడు.

ఈరాజ్యాంగము 1922 వ సంవత్సరమున, ఇంగ్లీషు వారికి ఐరిషు వారికి జరిగిన సంధిపత్ర పర్యవసానముగా యేర్పడినది.

10. ఐరిషు ఫ్రీస్టేటు
యొక్క రాజ్యాంగము.

ఆసంధిపత్రము ద్వారా, దక్షిణ ఐర్లాండు అధినివేశ స్వాతంత్ర్యము బొందినది. క్రీ. శ. 1932 నందు, జరిగిన యెన్నికలలో జయమందిన శ్రీ డీవెలరాగారి, రిపబ్లికను పార్టీవారు బ్రిటిషువారి రాజునకులోబడి యుండరాదని తలంచి రాజభక్తి ప్రమాణమును రద్దుజేయుటకై బిల్లును శాసనసభలచే నంగీకరింప జేయ ప్రయత్నించుచున్నారు. ఈబిల్లు అంగీకరింపబడి, శాసనరూపము దాల్చుచో, బ్రిటిషుసామ్రాజ్యమునుండి, ఐర్లండు విడివడును. ఈరాజ్యాంగ విధానపు సవరణను ప్రథమమున రెండుశాసనసభలు అంగీకరింపవలెను. అంతటది ప్రజలకు 'రిఫరెండము' కై పంపబడవలెను. వారొప్పుకొనుచో నయ్యది శాసనమగును. (వోటరులందు అధిక సంఖ్యాకులుగాని, వోటుచేసిన