పుట:Adhunikarajyanga025633mbp.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రెండు - డచ్చి ప్రజలయొక్కయు, ఇంగ్లీషు ప్రజలయొక్కయు భాషలకు, రాజ్యాంగమందు సమానగౌరవము, ప్రాముఖ్యత నొసంగుట, మూడు - నీగ్రోలకు జెందిన బసోటోలాండు, బెచునాలాండు, స్వాజీలాండు రాష్ట్రముల పాలించుటకు నిర్నీతమైన నియమములు. ఈమూడు భాగములం దేసవరణయైన చేయవలెనన్న, కేంద్ర రాజ్యాంగ మందలి రెండు శాసనసభలొకచో కలసి సమావేశమైనప్పుడు తమసభ్యులందరిలో మూడింట రెండువంతుల మంది అట్టిసవరణ నంగీకరించవలసి యుండును.

జూగోస్లావియా దేశమందు మ్రోటులు, సర్బులు, స్లోవెనులను త్రివిధజాతులు కలవు. వీరికి వేరు వేరు భాషలు కలవు.

9. జూగోస్లావియా
రాజ్యాంగము.

ఒకప్పుడు వీరు ఆస్ట్రియా, రషియా, టర్కీ, జర్మనీ రాజ్యములకు చెందియున్నను, యుద్ధానంతరము తమప్రత్యేక రాజ్యాంగము నేర్పరచుకొనిరి. పేరునకు రాజు నేర్పరచుకొన్నను, బాధ్యతాయుత ప్రభుత్వసంస్థల నేర్పరచిరి.

వీరిరాజ్యాంగవిధానపు చట్టమును సవరించుటకు, మంత్రులసలహాపై రాజునకధికారము కలదు. ప్రజాప్రతినిధి సభవారు ప్రతిపాదించుచో, ఆసవరణ పదింట మూడు వంతుల మందిచే నంగీకరింపబడవలెను. రాజుయొక్క ప్రతిపాదనము పైగాని, సభవారి ప్రతిపాదనముపైగాని, ప్రజాప్రతినిధిసభ యంతమొంది, క్రొత్తసభకు ఎన్నికలుజరిగి అయ్యది సమా