పుట:Adhunikarajyanga025633mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరుగో!

ఆంధ్రులు నవీనభారతదేశ జీవనమందు గణనీయులు!

భారతదేశ స్వాతంత్ర్య సమరమున ఆంధ్ర స్త్రీలు, పురుషులు, బాలబాలికలు తమసేవాహారతులతో, కలకల లాడుచు వచ్చుచున్నారు.

తమమట్టిని కనకముగా, తమనీటిని అమృతముగా మార్చుచున్నారు.

సంఘసేవ, దేశసేవ మానవసేవ ఆంధ్రులకు ప్రాణ సమానమగుచున్నది.

వీరికి ఆదిగురువును, నాయకుడును, ఆదర్శప్రాయుడును అగు "దేశభక్తుడు" పూజనీయుడు.

"వీరగంధము దెచ్చినారము, వీరుడెవ్వడో తెల్పుడీ" అను ఆంధ్రబాలికలకు ఈపండువంటి ముదుసలియే ఆదర పాత్రుడు.

రెందుపుష్కరములక్రితమే ప్రజాసేవ కాంక్షించి, దేశసేవయే వృత్తిగాగొని, సర్వశక్తుల నాంధ్రులకై వెచ్చించి తన "మాయ"చే సృష్టింపబడిన ఆంధ్రోద్యమమును, భారత స్వాతంత్ర్యోద్యమమందు లీనమొనర్చి, తనను, తనప్రజలను, తనదేశమును ధన్యతనొందించిన శ్రీ కొండా వెంకటప్పయ్య గారికిదే కృతజ్ఞతాపూర్వక వందనములు.

రంగనాయకులు

కృష్ణజయంతి

25-8-32