పుట:Adhunikarajyanga025633mbp.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మును చులకనగా మార్పుజేయుచుండుట కడుంగడు సులభమనియు, చట్టమేర్పడినచో అత్యంత కష్టసాధ్యమనియు కొందరు పొరపాటభిప్రాయము నందుచున్నారు. ఇంగ్లండుదేశపు రాజ్యాంగవిధానమునకు చట్టమొక్కటి లేకున్నను దానివలన యేర్పడిన ప్రభువులసభను సంస్కరించుట కెన్నో వత్సరములు పట్టెను. ఇప్పటికొక శతాబ్దమునుండి ఈసభాసభ్యులెల్లరు ఇప్పటివలె జీవితాంతమువరకు వంశపారంపర్యాయ హక్కుతోసహా సభ్యత్వము బొందుటకుమారు ఎన్నుకొనబడునట్లు చేయవలెనని యెన్నోప్రయత్నములు జరిగెను. కాని యిప్పటివర కవి అపజయమందుచున్నవి. రాజ్యాంగ విధానపు చట్టము బొందియున్న ఇటలీదేశమందె సవరణ యగత్యము లేకయె శ్రీముస్సోలీనీగారి నిరంకుశపాలనమేర్పరుపబడినది. కనుక రాజ్యాంగవిధానముల సంస్కరణ సౌలభ్యత వాని స్వరూపములపై యాధారపడి యుండదు.

కొన్ని రాజ్యాంగవిధానముల మార్చుట కడుంగడు సులభము. మరికొన్నిమార్చుట కష్టతరము. సమావేశమందున్న పార్లమెంటుసభ్యులు అధిక సంఖ్యాకముగా ఏదేనొక్క రాజ్యాంగవిధానపు సంస్కరణ నపేక్షించుచో అద్దాని నంగీకరింపగల్గు శక్తి వారికున్నయెడల అట్టి రాజ్యాంగవిధానమును "మెత్తనిదని" (flexible) చెప్పెదరు. సాధారణముగా శాసనముల నిర్మించు పద్ధతినిగాక ప్రత్యేక పద్ధతి ననుసరించి రాజ్యాంగ