పుట:Adhunikarajyanga025633mbp.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


న్యపుక్షీణతను కల్గించుననియు చరిత్రతెల్పుచున్నది. రోమను సెనటరులు తమస్వార్థపరత్వము, సంకుచిత స్వభావములవల్ల చక్రవర్తుల నిరంకుశపాలనమును దెచ్చిపెట్టిరి. ఇంగ్లాండు నందు, ప్రభువులు (సామంతభూస్వాములు) ప్రజలహింసించి, తుదకు, ప్రజాందోళనమునకు తలయొగ్గిరి. ఫ్రాన్సునందు, రషియాయందు ప్రభువులు (సామంతభూస్వాములు) తమ చక్రవర్తులతోబాటు అధ:పతితులై విప్లవములకు దారిదీసిరి. మనదేశమునందు తమవక్రమార్గములచేతను, అప్యక్తవ్యవహారములవలన, మహమ్మదీయుల రాజ్యపాలనము దెచ్చిపెట్టిరి.

తుదకు ప్రజాస్వామిక రాజ్యాంగమే ప్రజలకు శరణ్యమగుచున్నది. దాదాపు అన్నిముఖ్యదేశములందును ఇప్పటికి ప్రజాస్వామిక రాజ్యాంగమేస్థాపితమైనది. ఐతే పురాతన కాలమునుండి వచ్చియున్న నిరంకుశ రాజ్యమేలిన రాజవంశకులు, సామంతభూస్వాములుగా నున్నవారు, కొన్నికొన్ని రాజ్యాంగములం దిప్పటికిని కొంతవరకు రాజ్యాంగాధికారమును పొందియున్నారు. ఇంగ్లాండునందు ఐదవజార్జిప్రభు నిప్పటికిని రాజ్యాంగమునందు ప్రధానాధికారిగానున్నాడు. బ్రిటిషువారి అధినివేశపురాజ్యములందింకను అతని ప్రతినిధులే ప్రధానాధికారులుగా వ్యవహరించుచున్నారు. ఇంగ్లాండునం దిప్పటికి కొలదిగా శాసననిర్మాణాధికారముకల్గిన ప్రభువులసభ యందు