పుట:Adhunikarajyanga025633mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము.

రాజ్యాంగ విధానపు చట్టము

1

ఆధునిక ప్రపంచమందు అనేకవిధములగు రాజ్యాంగ విధానములుకలవు. ఇప్పటికిని కొన్ని దేశములు నిరంకుశ

సవరణచేయు
మార్గములు,

పాలనమునకు లోనైయున్నవి. ఆఫ్‌ఘనిస్థానము, భారత దేశపు స్వదేశసంస్థానములు, అబిస్సీసియా, బల్గేరియా, ఇటలీ, దక్షిణ అమెరికా ఖండమందలి తాష్ట్రములు యిట్టి రాజ్యపాలనమును బొందియున్నవి. కాని యట్టి రాజ్యాంగవిధానము సక్రమమైనది కాదనియు, ప్రజాసామాన్యమునకు లాభకరము కాదనియు, దేశాభివృద్ధికారకము కాదనియు రాజకీయజ్ఞులం దెక్కువమంది యొక్కయభిప్రాయమైయున్నది. అప్పటికెప్పుడో శ్రీ అరిస్టాటిలుగారే యీరాజ్యాంగపుపద్ధతి శాశ్వతముగాజాలదని ఆ కాలపుటనుభవముబట్టియే నిర్ధారణ జేసియుండెను. ఇప్పటివరకు కల్గిన చరిత్రానుభవముబట్టియు ఈపద్ధతిశాశ్వతముకాదనియు, అభిలషణీయము కాదనియు నిరూపణయగుచున్నది.

అల్పసంఖ్యాకులకే చెందిన రాజ్యాధికారమును సాధ్యపరచు రాజ్యాంగముకూడ తాత్కాలికమైనదనియు, దేశారిష్టదాయకమనియు, అశాంతికి కారకమనియు, ప్రజాసామా