పుట:Adhunikarajyanga025633mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అసత్యప్రచారము జేయుటకు వెనుకంజవేయుట లేదు. తుదకు ప్రజలే ఎన్నికలన్నిటియందు శ్రద్ధవహించుట లేదు. ఆస్ట్రేలియాదేశమందు ఎన్నికలందు పాల్గొనని వోటరులకు శిక్ష విధించు టగత్యమగుచున్నది. అమెరికాయందు స్థానిక సంస్థలకై జరుగు యెన్నికలకు ప్రజాబాహుళ్యము వెల్లుటయే లేదు. ఇంగ్లండునందు స్థానికసంస్థల యెన్నికలలో సగముమందియైన, వోటర్లుతమవోటుల నిచ్చుట లేదు. ప్రజలిట్లు ఉదాసీనత వహించునంత కాలము రాజ్యాంగ శాంతికి భద్రము కాజాలదు.

వార్తాపత్రికలు, ప్రజాక్షేమమును మరువక, సత్య ప్రచారమునే తమధర్మముగా పరిగణించిననే, ప్రజలకురాచకీయ విజ్ఞానము కల్గుట సాధ్యము. ఎప్పటికప్పుడు రాజ్యాంగ వ్యవహారము లెట్టిస్థితియందున్నవో, ఎల్లరకు తెలియునట్లు వార్తాపత్రికలు ప్రకటించిననే ఎన్నికలయందు తగురీతి వోటరులు దుష్టుల శిక్షించి, శిష్టులరక్షించుటకు వీలగును. ఇప్పటి వార్తాపత్రికలు చాల అసంతృప్తికరముగనున్నవి. వానికసత్యమన్న ప్రీతియా యనిపించుచున్నది. విప్లవములు వార్తాపత్రికల దుష్ప్రచారమువలన సాధ్యమగుచుండుట అసత్యము కాదు.

తుదిమాట, రాజ్యాంగవిధానము, ప్రజాస్వామికము జయప్రదముగా, సులభముగా ప్రజలక్షేమాభివృద్ధి కారక