పుట:Adhunikarajyanga025633mbp.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యకులు అక్రమవర్తనులగుటయే ముఖ్యకారణము. కనుకనే మాహాత్ముడు తనజీవితముద్వారా, తన చర్యలవల్ల బోధించుచున్నట్లు నైతికపద్ధతులమూలముననే, నీతిపరుల నాయకత్వముక్రిందనే, ధర్మచింతగల ప్రజలమధ్యనే, విజ్ఞానులగు పౌరులద్వారా ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాగలదు.

రాజ్యాధికారము ప్రజలకు ప్రసాదించినంతమాత్రమున వారు రాజ్యమును సక్రమముగా నడుపజాలరు. వారెల్లరు విద్యాబుద్ధుల బొందవలెను. స్థానిక స్వపరిపాలనా సంస్థలద్వారా, వివిధప్రజాస్థాపిత సంస్థలద్వారా వారుశ్రద్ధమై రాజాకీయానుభవమును సంపాదించవలెను. ప్రజాక్షేమాభిలాషులగు నాయకులను, ప్రజలశ్రేయమునే కోరు వార్తాపత్రికలను, ప్రజలకు నైతికాభివృద్ధి కల్గింపగల్గు రాచకీయ కక్షలనే వారు ఆదరించి స్వీకరంచిననే వారిరాజ్యాంశపు ప్రతిభ హెచ్చుకాగలదు. తమరాజ్యాధికారమును సక్రమముగా సకాలమున నుపయోగించుటకు ప్రజలు సంసిద్ధులై యుండవలెను. ఈకాలమందిట్లుగాక అనేకప్రజాస్వామిక రాజ్యాంగములందు రాజ్యాధికారపుటనుభవము, ప్రజలకు కల్గుసదుపాయములు లేవు. పార్టీనాయకులు స్వార్ధపరులగుటయేకాక సంకుచితభావులై యున్నారు. ప్రజానాయకులు నైతికప్రవర్తనకు పేరొందుట లేదు. వార్తాపత్రికలు స్వలాభముకై